For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6.95 శాతంతో 17 నెలల గరిష్టానికి భారత్ సీపీఐ ద్రవ్యోల్భణం

|

భారత్ రిటైల్ ద్రవ్యోల్భణం మార్చి నెలలో 6.95 శాతంతో పదిహేడు నెలల గరిష్టానికి ఫిబ్రవరి నెలలో ఇది 6.07 శాతంగా నమోదయింది. ఈ మేరకు ఏప్రిల్ 12న మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డేటాను విడుదల చేసింది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ద్రవ్యోల్భణం మార్చి నెలలో అంచనాలకు మించి ఉంది. ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెల 6 శాతం కంటే పైన నమోదయింది. జనవరి-మార్చి త్రైమాసికంలో సగటున 6.4 శాతంగా ఉంటుందని అంచనా. ఏప్రిల్ - జూన్, జూలై-సెప్టెంబర్ కాలంలో ఆర్బీఐ ఎంపీసీ అంచనాలను అందుకోలేకపోవచ్చు.

ఏప్రిల్-జూన్ కాలంలో సీపీఐ ద్రవ్యోల్భణం 6.3 శాతంగా ఉండవచ్చునని, జూలై-సెప్టెంబర్ కాలంలో 5.8 శాతంగా ఉండవచ్చునని ఆర్బీఐ తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. మార్చి నెలలో దాదాపు అన్ని రంగాల్లో ధరలు పెరిగాయి. దీంతో ద్రవ్యోల్భణం పెరిగింది. గత నెలలో కూరగాయలు, హౌసింగ్ ధరలు మాత్రమే స్వల్పంగా తగ్గాయి.

CPI inflation rockets to 17 month high of 6.95 percent in March

ఫుడ్ ఇండెక్స్ విషయానికి వస్తే ద్రవ్యోల్భణం 6.95 శాతంగా నమోదయింది. ఫుడ్ ఇండెక్స్ 7.6 శాతానికి పెరిగింది. ఇందులో సెరెల్స్, మీట్, ఫిష్, ఆయిల్, ఫ్యాట్స్, పల్సెస్ ధరలు పెరగగా, కేవలం కూరగాయల ధరలు మాత్రమే తగ్గాయి. క్లాతింగ్, ఫుట్ వేర్ ద్రవ్యోల్భణం 9.40 శాతానికి పెరిగింది. హౌసింగ్ మాత్రం 3.38 శాతానికి తగ్గింది. ఫ్యూయల్, లైట్ ద్రవ్యోల్భణం 7.52 శాతానికి, మిస్‌లీనియస్ 7.02 శాతానికి పెరిగాయి.

English summary

6.95 శాతంతో 17 నెలల గరిష్టానికి భారత్ సీపీఐ ద్రవ్యోల్భణం | CPI inflation rockets to 17 month high of 6.95 percent in March

India's retail inflation jumped to a 17-month high of 6.95 percent in March from 6.07 percent in February, according to data released on April 12 by the Ministry of Statistics and Programme Implementation.
Story first published: Tuesday, April 12, 2022, 18:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X