For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2008 సంక్షోభం కంటే భారీ ప్రభావం: ఇన్ఫోసిస్-HFS సర్వేలో ఆసక్తికర అంశాలు

|

ముంబై: కరోనా మహమ్మారి ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడిందని, అన్ని రంగాలపై అధికంగా ప్రభావం కనిపించిందని ఇన్ఫోసిస్ హెచ్‌ఎఫ్ఎస్ రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది. వివిధ రంగాల్లోని వ్యాపారాలపై బడ్జెట్, సరఫరా వ్యవస్థలు, ఉద్యోగుల లభ్యత తదితర అంశాల ప్రభావం ఏ మేరకు పడిందని ఈ కంపెనీలు సంయుక్తంగా నో వేర్ టు హైడ్: ఎంబ్రాసింగ్ ది మోస్ట్ సిస్మిక్ టెక్నాలజికల్ అండ్ బిజినెస్ చేంజ్ ఇన్ అవల్ లైఫ్ టైమ్ అధ్యయనం చేశాయి. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. రిమోట్ వర్క్ ప్రస్తుత క్లిష్ట పరిస్థితికి సరైన పరిష్కారమని ఈ సర్వేలో పాల్గొన్న 51 ఆర్గనైజేషన్లు అభిప్రాయపడ్డాయి.

SBI బాటలో PNB: ATM నుండి డబ్బు తీస్తున్నారా? ఈ కొత్త రూల్ తెలుసుకోండి

2008 కంటే ప్రభావం ఎక్కువ

2008 కంటే ప్రభావం ఎక్కువ

HFS రీసెర్చ్-ఇన్ఫోసిస్ సంయుక్తంగా 400 గ్లోబల్, 2000 ఎగ్జిక్యూటివ్స్‌ను సర్వే చేసింది. మహమ్మారి కారణంగా చితికిపోయిన వ్యాపారాలు ఏ మేరకు కోలుకుంటాయ, ప్రస్తుత పరిస్థితిని అధిగమించి ఎలా ముందుకెళ్తున్నాయో తెలుసుకునేందుకు సర్వే ద్వారా ప్రయత్నించారు. 2008లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కంటే కరోనా వల్ల వచ్చిన ఇబ్బందులు పెద్దవని, కంపెనీలపై భారీ ప్రభావం చూపిందని 70 శాతం మంది/సంస్థలు అభిప్రాయపడ్డాయి.

ఇవి ఐటీ వ్యయాలను పెంచుతాయి

ఇవి ఐటీ వ్యయాలను పెంచుతాయి

ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడి నుండైనా వర్క్ లేదా హైబ్రిడ్ వర్క్ ఫోర్స్ నమూనాతో ముందుకు వెళ్లే వెసులుబాటు ఉందని 51 శాతం సంస్థలు తెలిపాయి. బ్యాంకింగ్స్, ఇన్సురెన్స్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, హై-టెక్ ఇండస్ట్రీల్లోకి సంక్షోభ సమయంలో పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. క్లౌడ్, సైబర్ భద్రత, ఆధునికీకరణ డిజిటల్ వ్యాపార నమూనాలను, ఐటీ వ్యయాలను పెంచుతాయని సర్వేలో వెల్లడైంది. యాంత్రీకరణ, డిజిటల్ వ్యాపార నమూనాలకు మారడంతో పాటు ఖాతాదురుల అవసరాలకు తగినట్లు త్వరగా, పోటీగా స్పందించేందుకు హైపర్ స్కేల్ క్లౌడ్స్ వినియోగించుకున్నాయి.

మార్పును స్వీకరించేందుకు

మార్పును స్వీకరించేందుకు

మార్పును స్వీకరించందుకు, వ్యాపారాలను డిజిటలీకరణ చేసేందుకు కార్పోరేట్ ప్రపంచానికి కరోనా దోహదపడిందని వెల్లడించారు. కరోనా తర్వాత పరిస్థితులకు అనుగుణంగా పని విధానం మారాల్సిన అవసరాన్ని 90 శాతం సంస్థలు గుర్తించాయి. ఆఫీస్ వాతావరణం కొనసాగుతుందని కేవలం 37 శాతం కంపెనీలు చెప్పాయి. తమ వ్యాపారాలు అస్థిరత నుండి మెరుగైన స్థితికి చేరుకుంటాయని 65 శాతం మంది, డిజిటల్ పరివర్తనకు వేగంగా మారే ప్రణాళికను 60 శాతం కంపెనీలు, ఉత్పత్తి - సేవల పోర్ట్‌పోలియోను మార్చుకోవడం ద్వారా విలువైన ఖాతాదారుల వ్యాల్యూను పెంచుకునేందుకు 70శాతం సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

English summary

COVID 19 will have a bigger impact than the 2008: Infosys HFS Research

lmost 70 percent of respondents believe that COVID-19 will have a bigger impact than the 2008 downturn with budgets, supply chains, employee availability, and customer intimacy being impacted the most.
Story first published: Friday, December 4, 2020, 8:42 [IST]
Company Search