కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండియా లాక్‌డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు 21 రోజుల పాటు ఇది అమలులో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం స్పష్టం చేశారు. ఈ లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బంది పడటంతో పాటు వ్యాపారులు, కంపెనీలకు భారీ నష్టమే. ఈ ప్రభావం భారత ప్రభుత్వానికి రెవెన్యూ తగ్గించడంతో పాటు వృద్ధి రేటుపై కూడా ప్రభావం పడుతుంది.

రూ.9 లక్షల కోట్ల నష్టం
కరోనా మహమ్మారి కారణంగా ఇండియా లాక్‌డౌన్ కావడంతో 120 బిలియన్ డాలర్ల మేర నష్టమని నిపుణులు అంచనా వేశారు. అంటే దాదాపు రూ.9 లక్షల కోట్ల మేర (4 శాతం జీడీపీ) ప్రభావం పడనుంది. ఇప్పటికే పారిశ్రామికవర్గాలు తమ వృద్ధి అంచనాలు భారీగా దెబ్బతిననున్నాయని, ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

నష్టాల్లో ఈక్విటీ మార్కెట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్ 3వ తేదీన ఫస్ట్ బైమంత్లీ మానిటరీ పాలసీని ప్రకటించనుంది. వడ్డీ రేట్లు ఎక్కువగానే తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి మూడు వారాల లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.

వృద్ధి రేటు తగ్గింపు
ఇలాంటి పరిస్థితుల్లో 120 బిలియన్ డాలర్లు లేదా 4 శాతం జీడీపీ మేర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నట్లు బ్రిటిష్ బ్రోకరేజీ బార్స్‌లే వెల్లడించింది. అంతేకాదు, 2020-21 వార్షిక వృద్ధి రేటును 1.7 పాయింట్లు తగ్గించి 3.5కు పరిమితం చేసింది.

ఇతర దేశాల కంటే ముందే ఆర్బీఐ
మూడు వారాల లౌక్‌డౌన్ కారణంగా 90 బిలియన్ డాలర్ల మేర ప్రభావం ఉంటుందని, అంతకుముందే మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కరోనా విషయంలో ఇతర దేశాల కంటే ఆర్బీఐ ముందే చర్యలు తీసుకుందని దేశీయ బ్రోకరేజీ సంస్థ ఎమ్కే ప్రశంసించింది. అయితే ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని తగ్గించేందుకు పెద్దగా ఏమీ లేవని పేర్కొంది.

ప్రస్తుతానికి ప్రభుత్వం మౌనం..
లాక్ డౌన్ వల్ల కలిగే ఆర్థిక ప్రభావంపై భారత ప్రభుత్వం ప్రస్తుతానికి మౌనంగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని నిరోధించే అంశంపై ప్రధానంగా దృష్టి సారించిందని ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలని అంటున్నారు. అయితే ఆర్థిక శాఖ వంటివి మాత్రం ఆర్థిక ప్రభావంపై దృష్టి సారించాయని, చర్యలు ఏముంటాయో చూడాలని అంటున్నారు.

ఆర్థిక ప్యాకేజీ
ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటి కారణంగా అసంఘటితరంగం తీవ్రంగా దెబ్బతిన్నదని ఎమ్కేపేర్కొంది. చిన్న వ్యాపారులకు సులభతర రుణాలు, రుణ పునర్నిర్మాణం, నగదు బదలీ వంటి ఆర్థిక ప్యాకేజీ వంటి వాటిని ప్రభుత్వం అమలు చేయవచ్చునని తెలిపింది. ఆర్థిక ప్యాకేజీ సిద్ధమవుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications