For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Covid-19: ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ షట్‍‌డౌన్! అమెజాన్‌లో ఇవి మాత్రమే కొనుగోలు చేయవచ్చు

|

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 3 వారాల పాటు దేశవ్యాప్తంగా షట్ డౌన్‌కు పిలుపునిచ్చారు. ప్రజలు అత్యవసర సమయంలో తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రయివేటు, ప్రభుత్వ కంపెనీలు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఇప్పుడు పూర్తిగా బంద్ అయినట్లే. ఈ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా ఇందులో భాగమవ్వాలని నిర్ణయించుకుంది.

భారీగా తగ్గి.. హఠాత్తుగా రూ.1,100 పెరిగిన బంగారం ధర, అక్కడ రోజులో 100 డాలర్లుభారీగా తగ్గి.. హఠాత్తుగా రూ.1,100 పెరిగిన బంగారం ధర, అక్కడ రోజులో 100 డాలర్లు

అమెజాన్ బాటలో ఫ్లిప్‌కార్ట్

అమెజాన్ బాటలో ఫ్లిప్‌కార్ట్

కరోనా వైరస్ మహమ్మారిని నియమింత్రించేందుకు దేశవ్యాప్తంగా షట్ డౌన్ నేపథ్యంలో తాము తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు మంగళవారం అమెజాన్ ఇండియా కూడా తమ నాన్ ఎషెన్షియల్ ఆర్డర్ సేవలను ఆపివేస్తున్నట్లు తెలిపింది. కేవలం అత్యవసర వస్తువుల పైనే దృష్టి సారిస్తామని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ కూడా మరుసటి రోజు ఈ నిర్ణయం తీసుకుంది.

ఫ్లిప్‌కార్ట్ సందేశం

ఫ్లిప్‌కార్ట్ సందేశం

ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్‌కు వెళ్తే సహచర భారతీయులారా.. తాత్కాలికంగా సేవలు నిలిపివేశామనే సందేశం కనిపిస్తుంది. మీ అవసరాలే తమ ప్రాధాన్యత, సాధ్యమైనంత త్వరలో సేవలను అందుబాటులోకి తీసుకు వస్తామని, ప్రస్తుతం గతంలో లేనంత క్లిష్ట పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొంది. మీరు ఇంట్లోనే ఉండాలి.. భద్రంగా ఉండాలని కూడా పేర్కొంది.

అమెజాన్‌లో అత్యవసర ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు

అమెజాన్‌లో అత్యవసర ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు

వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ఇటీవలి కాలంలో ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్ సైట్లు బిజినెస్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అమెజాన్, స్నాప్‌డీల్, బిగ్ బాస్కెట్, గ్రోఫెర్స్ వంటి వాటివీ ఇదే పరిస్థితి. అత్యవసర ఫుడ్, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్స్‌కు మినహాయింపు ఉంది. కానీ ఇది సప్లై చైన్ సిస్టంకు కష్టతరంగా మారింది. ఫ్లిప్‌కార్ట్ అన్ని సేవలను నిలిపివేసింది. కానీ అమెజాన్ అన్ని ఆపరేషన్స్‌ను క్లోజ్ చేయలేదు. అత్యవసరమైన వాటిని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర ఉత్పత్తులు అందిస్తామని, ఇతర ఉత్పత్తులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అంటే ఫుడ్, మెడిసిన్ వంటివి కొనుగోలు చేయవచ్చు

English summary

Covid-19: ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ షట్‍‌డౌన్! అమెజాన్‌లో ఇవి మాత్రమే కొనుగోలు చేయవచ్చు | Covid 19 India shutdown: Flipkart temporarily suspends services

Walmart Inc's Flipkart has suspended services, a notice on the e-commerce firm's website said on Wednesday, as India began a 21-day lockdown to fight the spread of the coronavirus pandemic.
Story first published: Wednesday, March 25, 2020, 10:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X