కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కూడా భారీగా పడిపోయింది. జనవరి-మార్చి నెలలో ఏకంగా 29 శాతం సేల్స్ పడిపోయాయి. 7 ప్రధాన మెట్రో నగరాల్లో కలిపి ఇళ్ల అమ్మకాలు ఈ 29 శాతం తగ్గి 27,451కి పడిపోయాయి. అమ్మకం కాని ఇన్వెంటరీస్ 3.65 లక్షలకు పెరిగాయి. ఈ మేరకు జేఎల్ఎల్ నివేదిక తెలిపింది.

టాప్‌లో బెంగళూరు.. రెండో స్థానంలో హైదరాబాద్
కరోనా ప్రభావం వల్ల భాగ్యనగరంలో ఇళ్ల విక్రయాల తగ్గుదల ఏకంగా 41 శాతం పడిపోయింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో మూడు నెలల కాలంలో 3,027 ఇళ్లు మాత్రమే విక్రయమయ్యాయి. అమ్మకాల క్షీణతలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. రియల్టీ కన్సల్టింగ్ సంస్థ జేఎల్ఎల్ తాజా నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో అందరూ ఇళ్ల కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారని జేఎల్ఎల్ కంట్రీహెడ్, సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు.

భారీగా పడిపోయిన సేల్స్
ఇళ్ళు కొనేవారు లేక ప్రాజెక్టులపై పెట్టిన పెట్టుబడులు వెనక్కిరాక కంపెనీలు దివాళా అంచుకు చేరుకున్నాయని, ఇప్పటికే రూ.3.65 లక్షల కోట్ల విలువైన ఇళ్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయని, కానీ కొనేవారు లేరని జేఎల్ఎల్ తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 38,628 నివాస గృహ విక్రయాలు జరుగగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అమ్మకాలు 27,451కి పడిపోయాయి.

ఏ నగరంలో ఎంత పడిపోయింది?
ఇంటి సేల్స్ పడిపోయిన నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 52 శాతం పడిపోయి 4,186 యూనిట్లుగా ఉంది. రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌లో 41 శాతం తగ్గి కేవలం 3,027 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలో 35 శాతం తగ్గి 1,259, ముంబైలో 19 శాతం తగ్గి 6,857, ఢిల్లీ ఎన్సీఆర్‌లో 18 శాతం తగ్గి 5,941, పుణేలోను 18 శాతం తగ్గి 3,728, చెన్నైలో 8 శాతం తగ్గి 2,453కి పడిపోయాయి.

రూ.3,65,100 కోట్ల పెట్టుబడులు నిలిచిపోయాయి
2020 మొదటి మూడు నెలల్లో అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. అదే సమయంలో కొత్తగా ప్రారంభమైనవి 3 శాతం పెరిగి 40,574కు పెరిగాయి. అమ్ముడుకాని ఇన్వెంటరీలు 2019 డిసెంబర్ నాటికి 4,42,228 యూనిట్లుగా ఉండగా, ఇప్పుడు అవి 4,55,351కు పెరిగాయి. దేశవ్యాప్తంగా మార్చి చివరి నాటికి టాప్ 7 నగరాల్లో డెవలపర్లకు చెందిన రూ.3,65,100 కోట్ల పెట్టుబడులు అలాగే ఉండిపోయాయి. అంటే అంత వ్యాల్యూ ఇళ్ల అమ్మకాలు నిలిచిపోయాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ETFs.. కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications