For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షట్ డౌన్ చేసి 6-10 వారాల్లో కరోనా నుండి తేరుకోవచ్చు: బిల్ గేట్స్

|

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, ఫిలాంత్రపిస్ట్ బిల్‌గేట్స్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనాపై స్పందించారు. ఆరు వారాల నుండి 10 వారాల మధ్య అన్నీ షట్ డౌన్ అయితే కరోనా సంక్షోభం నుండి బయట పడవచ్చునని సూచించారు. సాధ్యమైనన్ని ఎక్కువసార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు కఠిన నిబంధనలు అమలు చేసే దేశాలు కరోనా సంక్షోభం నుండి ఆరు నుండి 10 వారాల్లో బయటపడతాయన్నారు.

ఆర్థికంగానే కాకుండా ప్రజల ఆరోగ్యపరంగాను కోలుకుంటుందన్నారు. పరీక్షలు నిర్వహించడం, కఠిన నిబంధనలు అమలు చేయడం, దేశాన్ని షట్ డౌన్ చేయడంలో మంచి పనితీరు కనబరిస్తే చాలన్నారు. అలాంటి సమయంలో ప్రజలు అనవసరంగా ఆందోళన చెందకూడదన్నారు. సామాజిక దూరం కూడా పాటించాలన్నారు.

 Countries that shut down, Test for Coronavirus Could Bounce Back in 6 to 10 Weeks

ప్రస్తుతం ధనిక దేశాల్లో చాలా కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇలాంటి దేశాల్లో పరీక్షలు, కఠిన నిబంధనలు తప్పనిసరి అన్నారు. ఇలా చేస్తూ రెండు మూడు నెలల్లో ధనిక దేశాలు నియంత్రించాలన్నారు. ఆర్థిక నష్టాలు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ దేశాల్లో ధనిక దేశాల్లో ఉన్నట్లుగా హాస్పిటల్ కెపాస్టీ లేదన్నారు.

English summary

షట్ డౌన్ చేసి 6-10 వారాల్లో కరోనా నుండి తేరుకోవచ్చు: బిల్ గేట్స్ | Countries that shut down, Test for Coronavirus Could Bounce Back in 6 to 10 Weeks

Urging people to maintain calm and follow the safety guidelines, Microsoft founder and philanthropist Bill Gates has said countries that do a good job in testing of the deadly coronavirus and shut down could bounce back both economically as well as on the health front in weeks.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X