For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనాపై పోరుకు కంపెనీల పోరు, ఈ ఖర్చు ఇకపై CSR కిందకు

|

కరోనా నియంత్రణ కార్యకలాపాలకు కార్పోరేట్ సంస్థలు చేసే ఖర్చులను కార్పోరేట్ సామాజిక బాధ్యత(కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ-CSR) కింద చూపవచ్చునని కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా నుండి రక్షణ కోసం ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి నిల్వ ప్లాంట్ల స్థాపన, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలెటర్లు, సిలిండర్లు, ఇతర వైద్య పరికరాల తయారీ, సరఫరా అన్నీ CSR కిందకు వస్తాయని తెలిపింది.

కంపెనీస్ యాక్ట్ ప్రకారం రూ.500 కోట్లు అంతకుమించి వ్యాపారం, లేదా రూ.1000 కోట్లు అంతకుమించి టర్నోవర్ లేదా రూ.5 కోట్లు అంతకుమించి నెట్ ప్రాఫిట్ ఉంటే ఆయా సంస్థలు నెట్ ప్రాఫిట్ పైన 2 శాతం CSR కింద ఖర్చు చేయాలి. ఇప్పుడు కరోనా నేపథ్యంలో రిలయన్స్ వంటి సంస్థలు ఆక్సిజన్ తయారీ, మరిన్ని సంస్థలు ఇతర వైద్య పరికరాల తయారీలో ఉన్నాయి. ఇప్పుడు వీటిని CSR కింద చూపించవచ్చు.

Corporate spending on production of oxygen, ventilators counted as CSR

కాగా, కరోనా వైరస్‌పై పోరాడేందుకు తమ వంతు నిధులతో ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రావాలని కేంద్రమంత్రి సదానందగౌడ పిలుపునిచ్చారు. అలాగే కరోనా బాధితుల చికిత్స కోసం తాత్కాలిక ఆసుపత్రులు, సంరక్షణా కేంద్రాల ఏర్పాటు కోసం చేసే ఖర్చు చేసే నిధులను CSR కింద పరిగణిస్తామని గత ఏప్రిల్‌లో కేంద్రం తెలిపింది.

English summary

కరోనాపై పోరుకు కంపెనీల పోరు, ఈ ఖర్చు ఇకపై CSR కిందకు | Corporate spending on production of oxygen, ventilators counted as CSR

Amid an acute shortage of oxygen supplies that hampers treatment of the coronavirus infected, the government on Wednesday said that corporate spending on setting up oxygen production and storage plants will be counted as eligible corporate social responsibility(CSR) activities.
Story first published: Wednesday, May 5, 2021, 21:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X