For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వైరస్ ఎఫెక్ట్: భారీగా దూసుకెళ్లిన ఆ కంపెనీ షేర్ ధర

|

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. భారత్‌లోను ఓ కేసు నమోదయింది. గురువారం నాటికి కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 170కి చేరుకుంది. మరో 1700 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బాధితుల సంఖ్య దాదాపు ఎనిమిది వేలకు చేరుకుంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో హువాయి ప్రావిన్స్ వారే ఎక్కువగా ఉన్నారు. ఆ ప్రాంతానికి చెందిన వారు దాదాపు 40 మంది చనిపోయారు. ప్రతి రోజు వేలాది కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. మార్కెట్లను ఈ వైరస్ దెబ్బతీస్తోంది.

భారత్‌లో పన్ను తక్కువగా ఉందా: చైనా-అమెరికా-బంగ్లాతో పోలిస్తే.. అసలు కారణం ఇదేనా?భారత్‌లో పన్ను తక్కువగా ఉందా: చైనా-అమెరికా-బంగ్లాతో పోలిస్తే.. అసలు కారణం ఇదేనా?

దూసుకెళ్లిన జపాన్ ఈ కంపెనీ షేర్లు

దూసుకెళ్లిన జపాన్ ఈ కంపెనీ షేర్లు

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఢీలాపడగా, జపాన్‌లోని ఓ కంపెనీ షేర్లు మాత్రం భారీగా పుంజుకుంటున్నాయి. గత ఏడు సెషన్లలో ఈ కంపెనీ షేర్లు మూడు రెట్లకు పైగా దూసుకెళ్లింది. జపాన్‌కు చెందిన కవామోటో కార్పోరేషన్ వైద్య పరికరాలను తయారు చేస్తుంది.

మూడున్నర రెట్లు పెరుగుదల

మూడున్నర రెట్లు పెరుగుదల

కరోనా వైరస్ కారణంగా ముఖానికి తగిలించుకునే మాస్కులకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో ఈ కంపెనీ షేర్లు మూడు రెట్లకు పైగా పెరిగాయి. మంగళవారం నాడు ఈ కంపెనీ షేర్లు 23.65 శాతం పెరిగి JPY 2,091 వద్ద క్లోజ్ అయ్యాయి. జనవరి 17వ తేదీన JPY 591 ఉన్న షేర్లు ఇప్పుడు 3.5 రెట్లు పెరిగాయి.

అమెరికా కంపెనీ షేర్లు కూడా

అమెరికా కంపెనీ షేర్లు కూడా

అలాగే, మరో అమెరికన్ డిస్పోజబుల్ ప్రొటక్టివ్ కంపెనీ అల్ఫా ప్రో టెక్ లిమిటెడ్ షేర్లు జనవరి 17వ తేదీ నుంచి 2.2 శాతం పెరిగాయి. గత సోమవారం ఈ కంపెనీ షేర్లు 7.7 డాలర్ల వద్ద క్లోజ్ అయ్యాయి. ఇది 28.33 శాతం లాభం. జనవరి 17న ఈ షేర్ 3.51 డాలర్లుగా ఉంది. కరోనా వైరస్ కారణంగా ముఖానికి ధరించే మాస్కుల షేర్లు భారీగా పెరుగుతున్నాయి.

English summary

కరోనా వైరస్ ఎఫెక్ట్: భారీగా దూసుకెళ్లిన ఆ కంపెనీ షేర్ ధర | Coronavirus: Investors in mask makers see surge

Even as global indices witness a heavy sell-o amid growing concerns of Coronavirus, there is one group of investors who have seen their holdings more than triple in the wake of the situation: the ones who own the scrips of face mask-makers have seen a surge globally.
Story first published: Thursday, January 30, 2020, 18:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X