For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వైరస్ దెబ్బ: వర్క్‌ఫ్రం హోమ్, మార్కెట్లు అతలాకుతలం, చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే..

|

చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ ప్రభావం మార్కెట్లపై కూడా పడుతోంది. ఇన్వెస్టర్లు భయంతో సురక్షిత పెట్టుబడులైన బంగారం వంటి అతి విలువైన లోహాల వైపు చూస్తున్నారు. ఈ వైరస్ ప్రపంచ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చుననే ఆందోళనల నేపథ్యంలో సోమవారం భారత మార్కెట్లు కూడా ఢీలా పడ్డాయి. మెటల్, బ్యాంకింగ్ రంగ షేర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో నాలుగు నెలల్లో సెన్సెక్స్ రెండో అతిపెద్ద నష్టాన్ని చూసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 10 పైసలు తగ్గి 71.43 వద్ద క్లోజ్ అయింది.

కరోనా వైరస్ దెబ్బ, మళ్లీ పెరుగుతున్న బంగారం ధరకరోనా వైరస్ దెబ్బ, మళ్లీ పెరుగుతున్న బంగారం ధర

చైనా సహా అన్ని మార్కెట్లకు కరోనా వైరస్ దెబ్బ

చైనా సహా అన్ని మార్కెట్లకు కరోనా వైరస్ దెబ్బ

అంతర్జాతీయ మార్కెట్లు కూడా కరోనా వైరస్ కారణంగా వణికిపోతున్నాయి. కొత్త సంవత్సరం సెలవుల కారణంగా పలు ఆసియా మార్కెట్లు సోమవారం పని చేయలేదు. జపాన్ నిక్కీ 2 శాతం నష్టపోగా, ఐరోపా సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అమెరికా మూడు కీలక ఇండెక్స్‌లు 1.5 శాతానికి పైగా నష్టపోగా లండన్ FTSE 100 ఇండెక్స్ 2.3 శాతం నష్టంతో ముగిశాయి. చైనాలో గణనీయమైన అమ్మకాలు ఉన్న సంస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

చైనా ఆర్థిక వ్యవస్థ నిలిచిపోతే...

చైనా ఆర్థిక వ్యవస్థ నిలిచిపోతే...

కరోనా వైరస్ కారణంగా చైనాలో 81 మంది చనిపోయారు. 3,000 మందికి ఈ వైరస్ సోకినట్లుగా గుర్తించారు. ఇతర దేశాల్లో 44 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రభావం చమురు ధరలపై కూడా పడింది. చమురు ధరలు 2 శాతం పడిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 59.32కు పడిపోయింది. చైనా ఆర్థిక వ్యవస్థ నిలిచిపోతే క్రూడాయిల్‌కు మరింత డిమాండ్ తగ్గిపోతుందని ట్రేడర్స్ ఆందోళనగా ఉన్నారు.

నిర్బంధం.. వర్క్ ఫ్రమ్ హోమ్

నిర్బంధం.. వర్క్ ఫ్రమ్ హోమ్

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చైనా నుంచి వచ్చే తమ దేశీయులకు ఇతర దేశాలు పరీక్షలు చేస్తున్నాయి. చైనా కూడా అప్రమత్తమైంది. ప్రయాణాలపై అప్రమత్తంగా ఉంది. పలు చైనా కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని సూచిస్తున్నాయి.

ఉద్యోగులకు సెలవు

ఉద్యోగులకు సెలవు

వర్క్ ఫ్రం హోమ్‌కు అనుకూలంగా లేని కంపెనీలు, వ్యాపారులు తమ ఉద్యోగులకు సెలవులు ఇస్తున్న వారు కూడా ఉన్నారు. కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతం నుంచి వచ్చే ఉద్యోగులకు సెలవులు ప్రకటించి.. ప్రస్తుతానికి ఉద్యోగంలో జాయి అవాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.

2002లో వచ్చిన సార్స్‌తో పోలిక

2002లో వచ్చిన సార్స్‌తో పోలిక

ప్రస్తుత పరిస్థితిని పలువురు విశ్లేషకులు 2002లో వచ్చిన సార్స్‌తో పోలుస్తున్నారు. దీని కారణంగా అప్పుడు దాదాపు 800 మంది మృతి చెందారు. ఆ సమయంలో చైనా వార్షిక వృద్ధి 11 శాతం నుంచి 9 శాతానికి పడిపోయింది. కరోనా వైరస్ పైన అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ ప్రభావం మార్కెట్ పైన ఉంటుందని అంటున్నారు.

షేర్లపై ప్రభావం

షేర్లపై ప్రభావం

కరోనా వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. వినియోగదారులు ఖర్చులపై ఆచితూచి వ్యవహరిస్తారని ఆర్థిక నిపుణులు అంటున్నారు. సోమవారం యూరప్ అంతా షేర్లు క్షీణించాయి. జర్మన్ డాక్స్, ఫ్రెంచ్ కాక్ 40... ఈ రెండు కూడా 2.5 శాతం మేర పడిపోయాయి. గత నెలలో రికార్డ్ ధరకు చేరుకున్న చైనా పాపులర్ లగ్జరీ బ్రాండ్ షేర్లపై (LVMH, Kering, L'Oreal and Hermes వంటివి) ఈ ప్రభావం కనిపించింది.

తగ్గిన సేల్స్...

తగ్గిన సేల్స్...

లండన్‌కు చెందిన క్లాత్ మేకర్ బర్బెర్రీ సేల్స్ 4.79 శాతం మేరకు పడిపోయాయి. ఈ కంపెనీ సేల్స్‌లో 16 శాతం వాటా చైనా నుంచి వస్తుంది. కరోనా వైరస్ ప్రభావంతో ఈ సేల్స్ పడిపోయాయి. బర్బెర్రీ చైనాలో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటి. చైనా నుంచి వచ్చే ఆదాయంలో క్షీణత ఉంటే కంపెనీ ఆదాయం తగ్గుతుందని ఇన్వెస్టర్లకు తెలిపింది.

ఇవి కూడా నష్టపోయాయి...

ఇవి కూడా నష్టపోయాయి...

అమెరికాకు చెందిన విన్ రిసార్ట్స్ భారీగా నష్టపోయింది. ఇది మకావోలో క్యాసినోలు నిర్వహిస్తుంది. దీని షేర్లు ఏకంగా 8 శాతం పడిపోయాయి. లాస్ వెగాస్ సాండ్స్ షేర్లు 6.6 శాతం పడిపోయాయి. లాభాల్లోకి వచ్చిన కొద్ది షేర్లలో క్లోరోక్స్ ఒకటి. ఇది కేవలం 1 శాతం మాత్రమే లాభపడింది.

English summary

కరోనా వైరస్ దెబ్బ: వర్క్‌ఫ్రం హోమ్, మార్కెట్లు అతలాకుతలం, చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే.. | Coronavirus fears hit global shares and oil price

Worries over the continued spread of the coronavirus have hit financial markets, with stocks from Wall Street to Tokyo declining.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X