For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిజినెస్‌పై కరోనా ప్రభావం అంతగా ఉండకపోవచ్చు, మేం ఏం చేశామంటే: HCL

|

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించింది. ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రయివేటు సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచించింది. కరోనా అంశంపై HCL టెక్నాలజీస్ లిమిటెడ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి చివరలో కరోనా వెలుగు చూసినప్పటి నుండి తాము మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపింది.

ఉద్యోగులకు కాగ్నిజెంట్ గుడ్‌న్యూస్, ఏప్రిల్‌లో అదనపు శాలరీఉద్యోగులకు కాగ్నిజెంట్ గుడ్‌న్యూస్, ఏప్రిల్‌లో అదనపు శాలరీ

ఆర్థిక రంగంపై ప్రభావం

ఆర్థిక రంగంపై ప్రభావం

తమ కంపెనీ ఉద్యోగులు, క్లయింట్లపై ప్రభావం లేకుండా చూసేందుకు తాము ముందుగానే జాగ్రత్తపడ్డామని, రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రారంభించామని HCL టెక్నాలజీస్ తెలిపింది. కరోనా ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోందని, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం కనిపిస్తోందని, తాము సేవలు అందించే వివిధ దేశాల్లో ఆర్థికరంగంపై వివిధ రకాలుగా ప్రభావం కనిపిస్తోందని తెలిపింది.

ప్రభుత్వ సలహాలు, సూచనలు పాటిస్తున్నాం

ప్రభుత్వ సలహాలు, సూచనలు పాటిస్తున్నాం

హెచ్‌సీఎల్ టెక్నాలజీ స్పష్టమైన పాలసీని కలిగి ఉందని, తమకు ఉద్యోగుల భద్రత, వారి ఆరోగ్యం, క్లయింట్స్ కమిట్‌మెంట్స్ చాలా ముఖ్యమని తెలిపింది. ఉద్యోగుల భద్రత, క్లయింట్స్ ప్రాధాన్యత కోసం ఆ దిశగా చర్యలు చేపట్టామని తెలిపింది. హెచ్‌సీఎల్ ఇంటర్నల్ ఆఫరేషన్ సెంట్రిక్ బిజినెస్ కంటిన్యూటి ప్లాన్‌ను అమలు చేశామని పేర్కొంది. పరిస్థితిని ఎప్పటికి అప్పుడు పరిశీలిస్తున్నామని, ప్రభత్వాల సలహాలు, సూచనలు పాటిస్తున్నామని పేర్కొంది.

భారత్‌లో 76 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్

భారత్‌లో 76 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్

క్లయింట్లకు సేవలు అందించేందుకు తాము మార్గాలు అన్వేషించి, ఆ దిశలో వెళ్లామని, మా ప్రయత్నాల పట్ల తమ క్లయింట్స్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 76 శాతం మంది తమ ఉద్యోగులు, విదేశాల్లో 92 శాతం మంది తమ ఉద్యోగులు ఇంటి నుండి పని చేసేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది.

అన్ని జాగ్రత్తలతో...

అన్ని జాగ్రత్తలతో...

ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రభుత్వాలు, స్థానిక అధికారులు అనుమతించిన మేరకు తమ ఉద్యోగులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కార్యాలయాల నుండి పని చేస్తున్నారని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పటికీ ఈ కొత్త ఫార్మాట్లో తమకు ఎలాంటి అంతరాయాల ఎదురు కాలేదని, కార్యకలాపాలలో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదని తెలిపింది. తమకు ఎంతో సహకరించిన క్లయింట్స్, పారిశ్రామిక బాడీ, ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు అన్నారు.

కరోనా ప్రభావం అంతగా ఉండదు

కరోనా ప్రభావం అంతగా ఉండదు

మార్చి క్వార్టర్‌లో తమ బిజినెస్ పైన అంతగా ప్రభావం పడుతుందని తాము భావించడం లేదని హెచ్‌సీఎల్ తెలిపింది. కరోనా ప్రభావం లేదా లాక్ డౌన్ ప్రభావం అంతగా పడదని అభిప్రాయపడింది. బుకింగ్స్ ట్రాక్‌లో ఉన్నాయని తెలిపింది.

నిలదొక్కుకుంటాం..

నిలదొక్కుకుంటాం..

కరోనాకారణంగా ఈ త్రైమాసికంలో తమపై ఏ మేరకు ప్రభావం ఉంటుందనే లెక్కలు వేయలేదని తెలిపింది. ఉత్పత్తి ఆదాయాలు, నిర్వహణా సేవల ఆరోగ్యకర మిశ్రమం తమ బిజినెస్ మోడల్ అని తెలిపింది. రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టంలో ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి వాటి ద్వారా షార్ట్ టర్మ్‌లో వచ్చే ప్రభావాన్ని తాము తగ్గించుకుంటున్నామని తెలిపింది. పరిస్థితి ముందు ముందు మరింత దారుణంగా ఉంటే సిద్ధంగా ఉన్నామని తెలిపింది. లాంగ్ టర్మ్‌లోను బలంగా పని చేసేందుకు తమ బిజినెస్ మోడల్ ఉపయోగపడుతుందని తెలిపింది.

English summary

బిజినెస్‌పై కరోనా ప్రభావం అంతగా ఉండకపోవచ్చు, మేం ఏం చేశామంటే: HCL | Corona: HCL don't see major impact on March quarter Business

HCL Technologies Ltd (HCL) has been monitoring the Covid-19 outbreak since late January and had invoked its Business Continuity Plan and Risk Management Framework quite early to minimize the impact on its employees and clients.
Story first published: Monday, March 30, 2020, 14:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X