For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ తర్వాతే ఆఫీస్‌లకు రండి: ఆ ఉద్యోగులకు విప్రో, కాగ్నిజెంట్

|

కరోనావైరస్ ప్రపంచాన్ని భయానికి గురి చేస్తున్న నేపథ్యంలో సాఫ్టువేర్ రంగంలోని పలు కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటికే వివిధ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఇచ్చాయి. టెక్ దిగ్గజాలు విప్రో, కాగ్నిజెంట్ వంటి సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి.

కరోనా వైరస్ ప్రభావం.. మరిన్ని బిజినెస్ న్యూస్

చైనా సహా ఆ దేశాలకు వెళ్లకండి

చైనా సహా ఆ దేశాలకు వెళ్లకండి

చైనా ప్రధాన భూభూగంలోని హాంగ్‌కాంగ్, మకావ్ తదితర ప్రాంతాలకు వెళ్లవద్దని విప్రో తమ ఉద్యోగులను ఆదేశించింది. దీనిపై మళ్లీ ప్రకటన చేసేవరకు ఇది అమలులో ఉంటుందని తెలిపింది. సింగపూర్, సౌత్ కొరియా, జపాన్, ఇటలీ వంటి దేసాలకు కూడా వెళ్లవద్దని సూచిస్తున్నట్లు విప్రో తెలిపింది.

ఆ తర్వాతే ఆఫీస్‌కు రండి

ఆ తర్వాతే ఆఫీస్‌కు రండి

తమ కంపెనీకి చెందిన ఉద్యోగులు ఎవరైనా చైనా తదితర కరోనా ప్రభావిత ప్రాంతాలకు వెళ్తే వారు స్వచ్చంధంగా రెండు వారాల పాటు ఇంటి నుండి పని చేయాలని, ఆ తర్వాత ఎలాంటి వ్యాధి లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఆఫీస్‌కు రావాలని పేర్కొంది.

వూహాన్‌లో ఉద్యోగులు లేరు

వూహాన్‌లో ఉద్యోగులు లేరు

కరోనా వైరస్ పుట్టిన వూహాన్‌లో తమకు ఉద్యోగులు ఎవరూ లేరని విప్రో తెలిపింది. తమ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ ఉంటే స్వచ్చంధంగా వారు పర్యవేక్షణలో ఉండాలని సూచించింది. తమ కార్యాలయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది.

ఎప్పటికప్పుడు క్లీనింగ్

ఎప్పటికప్పుడు క్లీనింగ్

అన్నిచోట్ల స్క్రీన్లను ఏర్పాటు చేశామనిస సర్జికల్ మాస్క్‌లను అందుబాటులో ఉంచామని, తరుచూ కార్యాలయాలను క్లీన్ చేస్తున్నామని తెలిపింది. ఉద్యోగులు పరిశుభ్రత పాటించాలని సూచించింది. కరోనా లక్షణాలు కనిపిస్తే ఉద్యోగి వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని సూచించింది. పరిస్థితిని గమనిస్తున్నట్లు తెలిపింది. కాగ్నిజెంట్ కూడా తమ ఉద్యోగులకు సూచనలు చేసింది. ఉద్యోగుల ప్రయాణాలపై నిర్బంధం విధించింది.

English summary

ఆ తర్వాతే ఆఫీస్‌లకు రండి: ఆ ఉద్యోగులకు విప్రో, కాగ్నిజెంట్ | Cognizant, Wipro restrict travel due to Coronavirus spread

Wipro today announced that it will not allow any employee to travel to China, Hong Kong and Macau due to coronavirus risk.
Story first published: Thursday, March 5, 2020, 11:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X