For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గతంలో ఎన్నడూ లేనంతగా.. గుడ్‌న్యూస్, కాగ్నిజెంట్‌లో 23,000 ఉద్యోగ అవకాశాలు

|

ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. ఫ్రెషర్స్‌ను తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఐటీ రంగంలో ఇటీవల ఉద్యోగాలు తిరిగి పూర్వస్థితికి చేరుకుంటున్నాయి. కాగ్నిజెంట్ ఈ ఏడాది భారత్‌లో 23,000కు మించి ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నట్లు తెలిపింది. 2020 క్యాలెండర్ ఏడాదితో పోలిస్తే ఇది 35 శాతం అధికమని కంపెనీ సీఎండీ రాజేష్ నంబియార్ తెలిపారు. 2020 సంవత్సరంలో కంపెనీ 17,000 మందికి పైగా కొత్త వారిని తీసుకున్నట్లు తెలిపింది. ఇంటర్న్‌షిప్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.

LPG Cylinder Rates: 3 నెలల్లో రూ.200 పెరిగిన గ్యాస్ ధరLPG Cylinder Rates: 3 నెలల్లో రూ.200 పెరిగిన గ్యాస్ ధర

2 లక్షలు దాటిన ఉద్యోగులు

2 లక్షలు దాటిన ఉద్యోగులు

కాగ్నిజెంట్‌కు సంబంధించి భారత్‌కు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఇక ముందు అదే కొనసాగుతుందని, 2020 క్యాలెండర్ ఏడాది ముగిసే సమయానికి భారత్‌లో తమ సంస్థలో దాదాపు 2,04,500 మంది ఉద్యోగులు ఉన్నారని, ఈ స్థాయిలో హెడ్ కౌంట్ తమకు మరే దేశంలో లేదని కంపెనీ చైర్మన్ అండ్ మేనేజంగ్ డైరెక్టర్ రాజేష్ నంబియార్ అన్నారు. భారత్‌లో హైక్వాలిటీ ఇంజినీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్, ఇతర టాలెంట్‌ను తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇంటర్న్‌షిప్

ఇంటర్న్‌షిప్

కాగ్నిజెంట్ 2020లో క్యాంపస్ ద్వారా 17,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకున్నది. 2021 క్యాలెండర్ ఏడాదిలో 23,000 మందిని తీసుకోనున్నది. గత ఏడాదితో పోలిస్తే ఇది 35 శాతం అధికం. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొదటి త్రైమాసికంలో ఉద్యోగులను తీసుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. టాలెంట్ అక్వైజేషన్‌లో తమ ప్రధాన కేంద్రాల్లో భారత్ ఉందన్నారు.

సంస్థ ఉద్యోగుల రీస్కీల్, అప్-స్కిల్ కొనసాగుతుందని తెలిపారు. గత 18 నెలల కాలంలో 1.3 లక్షల మంది ఉద్యోగుల డిజిటల్ స్కిల్స్ పెంపొందించినట్లు తెలిపారు. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం రన్ చేస్తున్నట్లు తెలిపింది. కాగ్నిజెంట్‌లో గత ఏడాది 5000 మంది ఇంటర్న్‌షిప్ పొందినట్లు తెలిపారు. ఈ ఏడాది దీనిని 10,000 మందికి పెంచనున్నట్లు తెలిపారు.

రిటెన్షన్ ఫండ్

రిటెన్షన్ ఫండ్

టాప్ పర్ఫార్మర్స్, డిజిటల్ స్కిల్డ్ ఎంప్లాయీస్ కోసం కంపెనీ ఇప్పటికే 30 మిలియన్ డాలర్ల రిటెన్షన్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. డిజిటల్ ప్రతిభకు తీవ్రమైన పోటీ ఉందని, కొన్ని రకాల నైపుణ్యాలకు సరఫరా-డిమాండ్ అసమతుల్యత ఉందన్నారు. కాగా, కాగ్నిజెంట్ ఆదాయం డిసెంబర్ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 2.3 శాతం పడిపోయి 4.18 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

English summary

గతంలో ఎన్నడూ లేనంతగా.. గుడ్‌న్యూస్, కాగ్నిజెంట్‌లో 23,000 ఉద్యోగ అవకాశాలు | Cognizant India says on track to bring in more freshers than ever before

Cognizant Technology Solutions Corp. is on course for record hiring in India in the January-March quarter as the IT services firm has stepped up job offers to both freshers and experienced personnel.
Story first published: Friday, February 19, 2021, 11:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X