For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూపర్: ఆ విషయంలో TCS నుండి నేర్చుకుంటున్న కాగ్నిజెంట్! మరేం చేయనుంది?

|

ఐటీ సర్వీస్ దిగ్గజం కాగ్నిజెంట్ కాస్ట్ కట్టింగ్ పైన దృష్టి సారించినట్లు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) మెక్‌లాగ్లిన్ వెల్లడించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఖర్చులను మెరుగ్గా నిర్వహించిందని, కాగ్నిజెంట్ అలా చేయలేకపోతోందని అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో కాస్ట్ కట్టింగ్ ఉంటుందన్నారు. కాస్ట్ మేనేజ్‌మెంట్‌లో టీసీఎస్ తీరు బాగుందన్నారు.

Moratorium: ఈఎంఐ వడ్డీ మాఫీకి ఆర్బీఐ నో, నిలదీసిన సుప్రీం కోర్టుMoratorium: ఈఎంఐ వడ్డీ మాఫీకి ఆర్బీఐ నో, నిలదీసిన సుప్రీం కోర్టు

టీసీఎస్ రెవెన్యూ కాస్ట్ రూ.92,322 కోట్లు

టీసీఎస్ రెవెన్యూ కాస్ట్ రూ.92,322 కోట్లు

2019-20 ఆర్థిక సంవత్సరం క్వార్టర్ 4 నాటికి ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న టీసీఎస్ రెవెన్యూ కాస్ట్ రూ.92,322 కోట్లు ఉంది. రెవెన్యూ కాస్ట్ అంటే ఉత్పత్తి కాస్ట్, కంపెనీ సేవల డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అన్నీ వస్తాయి. సాధారణంగా కంపెనీ ఉద్యోగుల వేతనాలు, ప్రయోజనాలు, సబ్ కాంట్రాక్ట్, ఎక్విప్‌మెంట్ కాస్ట్, ఇతర ఖర్చులు ఉంటాయి. టీసీఎస్ 4,48,464 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

కాగ్నిజెంట్ ఖర్చు రూ.80,359 కోట్లు

కాగ్నిజెంట్ ఖర్చు రూ.80,359 కోట్లు

అదే సమయంలో క్వార్టర్ 4 (డిసెంబర్) నాటికి న్యూజెర్సీ హెడ్ క్వార్టర్‌గా ఉన్న కాగ్నిజెంట్ రెవెన్యూ కాస్ట్ రూ.80,359 కోట్లు లేదా రూ.10.63 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగ్నిజెంట్ జనవరి నుండి డిసెంబర్ వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ఈ సంస్థలో 2,92,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణ అవసరమని కాగ్నిజెంట్ అభిప్రాయపడింది.

వ్యయ నియంత్రణ కోసం కాగ్నిజెంట్ ఏం చేయనుంది

వ్యయ నియంత్రణ కోసం కాగ్నిజెంట్ ఏం చేయనుంది

కాగ్నిజెంట్ వ్యయ నియంత్రణ (కాస్ట్ కట్టింగ్) పైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా వాలంటరీ సపరేషన్ ప్రోగ్రామ్, ఏడాది మధ్యలో ఉద్యోగాల కోత ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక ప్రాజెక్టుల్లో లేని ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇవ్వనుంది.గత ఏడాది కాలంగా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పలువురు నిష్క్రమించారు. 7,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశముందని అక్టోబర్ 2019లో కంపెనీ తెలిపింది.

ఇలా వ్యయ నియంత్రణ

ఇలా వ్యయ నియంత్రణ

ఎంట్రీ లెవల్ డిజిటల్ నైపుణ్యం కలిగిన ఎగ్జిక్యూటివ్స్‌ను ఎక్కువ మందిని నియమించడం ద్వారా సంస్థ ఖర్చులు తగ్గించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే క్లయింట్స్ ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

English summary

సూపర్: ఆ విషయంలో TCS నుండి నేర్చుకుంటున్న కాగ్నిజెంట్! మరేం చేయనుంది? | Cognizant hints at further cost cutting measures due to coronavirus

The IT multinational firm, Cognizant will further streamline costs in its core legacy business, Cognizant’s Chief Financial Officer (CFO), Karen McLoughlin has said.
Story first published: Friday, June 5, 2020, 18:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X