For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాగ్నిజెంట్‌పై సైబర్ దాడి, రాన్సమ్‌వేర్ అటాక్‌తో క్లయింట్స్‌కు ఇబ్బంది

|

మేజ్ రాన్సమ్‌వేర్ దాడితో ఇబ్బందులకు గురైనట్లు ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ప్రకటించింది. దీంతో తమ ఖాతాదారుల్లో కొంతమందికి అందించే సేవలకు అంతరాయం కలిగినట్లు తెలిపింది. కాగ్నిజెంట్ ఐటీ సంస్థలో ఇండియాలో 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మేజ్ రాన్సమ్‌వేర్ దాడికి సంబంధించిన సమాచారాన్ని కాగ్నిజెంట్ తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు చేరవేయడంతో పాటు వారికి రక్షణాత్మక సాంకేతికత అదించింది.

వ్యూహాం మార్చిన మాంసం వ్యాపారులు! రెండింతలు పెరిగిన ఆర్డర్లువ్యూహాం మార్చిన మాంసం వ్యాపారులు! రెండింతలు పెరిగిన ఆర్డర్లు

అడ్డుకోవడంతో పాటు చట్టపరమైన చర్యల దిశగా

అడ్డుకోవడంతో పాటు చట్టపరమైన చర్యల దిశగా

ప్రముఖ సైబర్ రక్షణ సంస్థలతో అనుసంధానమైన తమ అంతర్గత భద్రత బృందాలు ఈ దాడిని నిరోధించేందుకు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నట్లు కాగ్నిజెంట్ తెలిపింది. ఖాతాదారులు తమ కంప్యూటర్ వ్యవస్థ, డేటాను వినియోగించకుండా రాన్సమ్‌వేర్ అడ్డుపడుతుందని తెలిపారు. ఈ డేటాను వినియోగించాలంటే డబ్బులు చెల్లించాలని సైబర్ దాడికి పాల్పడ్డవారు డిమాండ్ చేస్తారు. ఈ దాడిని అడ్డుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలకు కాగ్నిజెంట్ సిద్ధమవుతోంది.

కాగ్నిజెంట్ ప్రకటన

కాగ్నిజెంట్ ప్రకటన

'మా ఇంటర్నల్ వ్యవస్థల భద్రతకు ముప్పు వాటిల్లింది. దీనివల్ల మాకున్న క్లయింట్లలో కొందరికి అసౌకర్యం కలుగుతుంది. ఇది మేజ్ ర్యాన్సమ్‌వేర్ దాడివల్ల జరిగింది' అని కాగ్నిజెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిని ఎదుర్కొనేందుకు తమ సైబర్ రక్షణ బృందాలు శ్రమిస్తున్నాయన్నారు.

సమాచారం దొంగిలిస్తుంది..

సమాచారం దొంగిలిస్తుంది..

ర్యాన్సమ్‌వేర్ సాధారణంగా యూజర్ల కంప్యూటర్లలోకి చొరబడి అందులోని విలువైన సమాచారాన్ని దొంగిలిస్తుంది. ఈ సమాచారాన్ని తిరిగి పొందాలంటే సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేసిన డబ్బును ఇవ్వవలసి ఉంటుంది.

కాగ్నిజెంట్‌కు 80 దేశాల నుండి పెద్ద ఎత్తున క్లయింట్స్ ఉన్నారు. గత ఏడాది 16.8 బిలియన్ డాలర్ల రెవెన్యూను నమోదు చేసింది. కాగ్నిజెంట్ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో కూడా కలిసి పని చేస్తోంది.

English summary

కాగ్నిజెంట్‌పై సైబర్ దాడి, రాన్సమ్‌వేర్ అటాక్‌తో క్లయింట్స్‌కు ఇబ్బంది | Cognizant confirms Maze ransomware attack

Cognizant Technology Solutions Corp., one of the world’s largest providers of IT services, said it became a victim of a ransomware attack that has caused disruptions to its clients.
Story first published: Monday, April 20, 2020, 7:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X