చైనా నుండి ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) గత మూడేళ్లుగా తగ్గుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 163.77 మిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సోమవారం లోకసభకు తెలిపారు. కేంద్రమంత్రి లెక్కల ప్రకారం గత మూడేళ్లుగా చైనీస్ పెట్టుబడులు తగ్గుతూ వస్తున్నాయి. భారత్-చైనా సరిహద్దులలో మూడేళ్లలో రెండోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకంటోంది. ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీలోకి పెట్టుబడులు రావడంతో కీలక నిర్ణయం తీసుకుంది.

భారీగా తగ్గిన పెట్టుబడులు, కంపెనీలు స్వాధీనం చేసుకోకుండా
2019-20 ఆర్థిక సంవత్సరంలోకి FDIల రూపంలో దేశంలోకి రూ.163.77 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2017-18లో రూ.350.22 మిలియన్ డాలర్లు రాగా, 2018-19లో 229 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయని కేంద్రమంత్రి వెల్లడించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది 28.5 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం భారీగా తగ్గాయని తెలిపారు. అంతకుముందు రెండేళ్ల క్రితంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో సగం కంటే ఎక్కువగా పడిపోయాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశీయ కంపెనీలను చౌకగా స్వాధీనం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

2020 క్యాలెండర్ ఏడాదిలో...
2020 క్యాలెండర్ ఇయర్లో భారత్‌లోకి 20.63 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గత ఏడాది ఇదే కాలంలో 27.57 మిలియన్ డాలర్లు వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో FDI పాలసీను కేంద్రం కఠినతరం చేసిన విషయం తెలిసిందే. చైనా కంపెనీలు భారత కంపెనీలను చేజిక్కించుకునే ప్రయత్నాలను అడ్డుకునే క్రమంగా FDI పాలసీని కఠినతరం చేసింది. చైనా లక్ష్యంగా.. భారత్‌తో సరిహద్దులు పంచుకున్న దేశాల కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులను కఠినతరం చేసింది.

ఎఫ్‌డీఐ నిబంధనలకు లోబడి
నిషేధించిన రంగాలు, కార్యకలాపాలు మినహా ఎఫ్‌డీఐ విధానానికి లోబడి ప్రవాస సంస్థలు పెట్టుబడులు పెట్టవచ్చునని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అయితే భారత్‌లో సరిహద్దు పంచుకునే లేదా ఆ దేశాలకు చెందినవారు లేదా సంస్థలు ప్రభుత్వ మార్గంలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని తెలిపారు. ఉదాహరణకు పాకిస్తాన్‌కు చెందిన ఓ కంపెనీ లేదా పెట్టుబడిదారు రక్షణ, అంతరిక్షం, అణుశక్తితో పాటు ఇతర నిషేధించిన రంగాలు, కార్యకలాపాలు మినహా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చునని చెప్పారు.
More From GoodReturns

ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications