For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Diwali Gift: దీపావళికి కార్స్, బైక్స్ గిఫ్ట్.. ఈ యజమాని సూపర్ భయ్యా.. ఎందుకిలా అంటే..

|

Diwali Gift: ఏడాది మెుత్తం పనిచేసిన ఉద్యోగులు తాము పనిచేసే సంస్థ నుంచి గుర్తింపు కోరుకుంటారు. అయితే కేవలం చాలా తక్కువ కంపెనీలు మాత్రమే ఉద్యోగులకు బోనస్ లేదా గిఫ్ట్స్ అందిస్తుంటాయి. అయితే ప్రస్తుత కాలంలో ప్రైవేటు కంపెనీల్లో ఇలాంటివి ఆశించటం అనేది వృధా ప్రయాస. ఈ క్రమంలో ఓ నగల దుకాణ యజమాని మాత్రం తన ఉద్యోగులకు ఊహించని బహుమతులను అందించాడు.

దీపావళి బహుమతులు..

దీపావళి సందర్భంగా తమిళనాడులోని చెన్నైకి చెందిన జ్యువెలరీ షాప్ యజమాని జయంతి లాల్ చయంతి తన ఉద్యోగులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. తన వద్ద పనిచేస్తున్న 10 మందికి కార్లు, 20 మందికి బైక్స్ గిఫ్ట్ గా అందించాడు. ఇందుకోసం అతడు ఏకంగా రూ.1.20 కోట్లను వెచ్చించాడు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. తమ యజమాని అందించిన బహుమతులతో చలానీ జ్యువెలరీ సిబ్బంది ఆశ్చర్యపోయారు. కొందరైతే ఏకంగా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

జయంతి లాల్..

జయంతి లాల్..

దీపావళికి తాను ఉద్యోగులకు అందిస్తున్న బహుమతులు వారిని మరింతగా ప్రోత్సహించటానికి దోహదపడతాయని ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపాడు. ఉద్యోగుల జీవితాలకు ప్రత్యేకతను జోడించటానికి ఇది ఉపయోగపడుతందని అన్నారు. వ్యాపారంలో ఎత్తు పల్లాలను ఎదుర్కొంటున్న సమయంలో తనతో పాటు కలిసిఉద్యోగులు నిలిచారని ఆయన తెలిపారు.

ఎత్తుపల్లాల్లో..

ఎత్తుపల్లాల్లో..

పనిచేసే సిబ్బందిగా మాత్రమే కాకుండా.. వారిని తన కుటుంబంలో భాగంగా భావిస్తానని ఆయన అన్నారు. అందుకే వారికి బహుమతులు ఇచ్చి సంతోషపెట్టాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు. దీని తర్వాత తాను హృదయపూర్వకంగా సంతోషంగా ఉన్నట్లు జయంత్ లాల్ అన్నారు. ప్రతి యజమాని తన దగ్గర పనిచేసే సిబ్బందికి, సహోద్యోగులకు బహుమతులు ఇచ్చి గౌరవించాలని ఆకాంక్షించారు.

నెగిజన్ల కామెంట్స్..

నెగిజన్ల కామెంట్స్..

ఉద్యోగుల పట్ల యజమాని చూపిన గౌరవం చాలా మంచిదని, ఇలాంటి నిర్ణయం చాలా మంచిదని అనేక మంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి కొందరైతే ఐటీ కంపెనీలు కేవలం ఒక డ్రైఫ్రూట్స్ బాక్స్ అందించి చేతులు దులుపుకుంటున్నాయని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే టాక్స్ చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నమని కామెంట్స్ చేశారు. ఏదేమైనప్పటికీ.. ఉద్యోగుల శ్రమను గుర్తించి వారికి బహుమతులు ఇవ్వటం ప్రశంసనీయం.

Read more about: jewellery shop diwali chennai gifts
English summary

Diwali Gift: దీపావళికి కార్స్, బైక్స్ గిఫ్ట్.. ఈ యజమాని సూపర్ భయ్యా.. ఎందుకిలా అంటే.. | Challani Jewellery shop owner Jayanthi Lal gifted cars, bikes to employees in chennai

Challani Jewellery shop owner Jayanthi Lal gifted cars, bikes to employees in chennai
Story first published: Monday, October 17, 2022, 12:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X