న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న కల్లోలం అంతా ఇంతా కాదు. కనీవినీ ఎరుగని ఉత్పాతానికి దారి తీసిందీ మహమ్మారి. దేశాన్ని కరోనా సెకెండ్ వేవ్ దారుణంగా దెబ్బ కొడుతోంది. జనం ఉసురు తీస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా మరణాలకు కారణమౌతోంది. వరుసగా మరోసారి కూడా నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. యాక్టివ్ కేసులు 37,23,446గా రికార్డయ్యాయి. ఇంతమందికి ఒకేసారి కరోనా ట్రీట్‌మెంట్ అందించలేక ఆసుపత్రులు సతమతమౌతున్నాయి. ఆక్సిజన్, పడకల కొరతను ఎదుర్కొంటున్నాయి.
ఈ పరిస్థితుల మధ్య కోవిడ్ పేషెంట్ల కోసం ట్రీట్‌మెంట్ చేస్తోన్న ఆసుపత్రుల్లో ఆర్థికపరమైన లావాదేవీలను నిర్వహించడానికి కేంద్రం విధించిన కొన్ని షరతులు, నిబంధనలు అడ్డుగా ఉంటోన్నాయి. రెండు లక్షల వరకు నగదు చెల్లింపులను జరిపే వీలు లేదు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 ఎస్టీ- దీనికి అంగీకరించదు. ఫలితంగా- ఒకేసారి రెండు లక్షల రూపాయల బిల్లింగులను కోవిడ్ పేషెంట్ల కుటుంబీకులు చెల్లించలేకపోతోన్నారు. ఈ ఇబ్బందులను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 ఎస్టీ నుంచి కోవిడ్ ట్రీట్‌మెంట్ ఆసుపత్రులకు మినహాయింపు ఇచ్చింది.

ఇది తాత్కాలికం మాత్రమే. ఈ నెల 31వ తేదీ వరకు ఈ సౌకర్యం అమల్లో ఉంటుంది. కిందటి నెల 1వ తేదీ నుంచి నిర్వహించిన లావాదేవీలన్నింటినీ దీని పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఆదాయపు పన్ను విభాగం ఓ ట్వీట్ చేసింది. కోవిడ్ ట్రీట్‌మెంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. రెండు లక్షల రూపాయలు లేదా అంతకు మించి నగదు లావాదేవీలను నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఫలితంగా- నగదు చెల్లింపులను అప్పటికప్పుడు పూర్తి చేసుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడానికి సంపూర్ణ వెసలుబాటును కేంద్ర ప్రభుత్వం కరోనా పేషెంట్ల కుటుంబీకులకు కల్పించినట్టయింది.
కోవిడ్ ఆసుపత్రుల్లో రెండు లక్షల నగదు లావాదేవీల పరిమితిని ఎత్తి వేయాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టులోనూ పిటీషన్లు దాఖలయ్యాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269 ఎస్‌టీ ప్రకారం ఒక వ్యక్తి నుంచి రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదును తీసుకోవడానికి వీల్లేదని, దీన్ని తొలగించాలంటూ మనీషా గుప్తా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 269 ఎస్టీ కింద రెండు లక్షల రూపాయలు, ఆపై ఎక్కువ నగదును తీసుకోవడానికి ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది విచారణలో ఉండగానే కేంద్రం ఆ పరిమితిని ఎత్తేసింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications