For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mehul Choksi case: డొమినికా హైకోర్టులో CBI, MEA ఇంప్లీడ్‌మెంట్ అప్లికేషన్లు

|

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న మెహుల్ చోక్సీని భారత్ రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI), మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్(MEA) డొమినికా హైకోర్టులో ఇంప్లీడ్‌మెంట్ పిటిషన్లు దాఖలు చేశాయి. సమాచారం మేరకు సీబీఐ మెహుల్ చోక్సీని భారత్‌కు రప్పించే అంశంపై, ఎంఈఏ అతని ఇండియన్ సిటిజన్‌షిప్ పైన దృష్టి సారించింది.

యూకే ప్రీవీ కౌన్సిల్‌లో దావా యత్నం

యూకే ప్రీవీ కౌన్సిల్‌లో దావా యత్నం

భారత్ నుండి పారిపోయి విదేశాల్లో ఉంటున్న ఆర్థిక నేర‌గాడు మెహుల్ చోక్సీని మన దేశానికి రప్పించే అవకాశాలు మెరుగవుతున్నాయి. చ‌ట్ట విరుద్ధంగా అంటిగ్వా నుండి డొమినికాకు పారిపోయిన చోక్సీకి యూకే ప్రీవీ కౌన్సిల్‌లో దావా వేసే అవ‌కాశం లేద‌ని లాయర్ మైఖెల్ పొలాక్ చెప్పారు. డొమినికాకు పారిపోయిన నేపథ్యంలో అంటిగ్వా పౌర‌స‌త్వం తొల‌గించ‌కుండా అడ్డుకునేందుకు ప్రీవీ కౌన్సిల్‌లో చోక్సీ త‌ర‌ఫున పిటిష‌న్ వేసే ప్రయత్నం చేశారు లాయర్. అంటిగ్వాకు బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్ అధిప‌తి. దీంతో అంటిగ్వా పౌర‌స‌త్వ ర‌క్ష‌ణ కోసం ప్రీవీ కౌన్సిల్‌లో చోక్సీ పిటిష‌న్ వేయ‌డానికి య‌త్నించారు.

పౌరసత్వం కాపాడుకోవడానికి..

పౌరసత్వం కాపాడుకోవడానికి..

అంటిగ్వా పౌర‌స‌త్వం కాపాడుకోవడానికి, భార‌త్‌కు త‌న‌ని అప్ప‌గించ‌కుండా అడ్డుకునేందుకు మెహుల్ చోక్సీకి ప్రీవీ కౌన్సిల్‌లో దావా చివ‌రి అవ‌కాశమని మైఖేల్ తెలిపారు. చోక్సీని వేధించార‌నే అభియోగంపై ద‌ర్యాప్తు చేయాల‌ని కూడా యూకే మెట్రోపాలిట‌న్ పోలీస్ వార్ క్రైం యూనిట్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు, తనను బ్రిటన్‌లో కిడ్నాప్ చేశారనే ఆరోపణలను భారత సంతతి పౌరులు ఖండించారు. తాము అతనిని ఎప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు.

అప్పటి వరకు పంపించడం సాధ్యం కాదని..

అప్పటి వరకు పంపించడం సాధ్యం కాదని..

డొమినికా కోర్టు విచారణ జరుగుతున్నంత వరకు మెహుల్ చోక్సీని భారత్‌కు పంపించడం సాధ్యం కాదని ఆయన తరఫు లాయర్ అన్నారు. డొమినికాలో తన మూలాలను వెల్లడించాక తమకు మరోమారు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే స్వేచ్ఛ ఉందని అంటున్నారు. మెహుల్ చోక్సీని నిషేధిత ఇమ్మిగ్రెంట్ అని డొమినికా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో భారత్‌కు తరలించేందుకు అవకాశాలు మెరుగు అయ్యాయి.

English summary

Mehul Choksi case: డొమినికా హైకోర్టులో CBI, MEA ఇంప్లీడ్‌మెంట్ అప్లికేషన్లు | CBI, MEA file impleadment applications in Dominica HC in Choksi case

CBI, MEA filed two separate applications in Dominican court in PNB Bank scam and citizenship issue.
Story first published: Sunday, June 13, 2021, 12:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X