For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Videocon Scam: తీగ లాగుతున్న సీబీఐ.. మరిన్ని కష్టాల్లోకి చందా కొచ్చర్.. బండారం బయటకు..!

|

Chanda Kochaar: దేశంలోని ప్రైవేటు రంగం దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ వీడియాకాన్ లోన్ స్కామ్ దర్యాప్తు వేగం పుంజుకుంది. కేసు సీబీఐ చేసికి వెళ్లటంతో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కేసు పరిధిని సైతం సీబీఐ పెంచుతోంది. దీంతో మాజీ అధిపతి చందా కొచ్చర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఉన్న కేసు సంగతి పక్కనబెడితే కొత్త కేసులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

శక్తి వంతమైన మహిళ నుంచి..

శక్తి వంతమైన మహిళ నుంచి..

ఒకప్పుడు ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల జాబితాలో నిలిచిన వ్యక్తి చందా కొచ్చర్. ఆయన భర్తకు చెందిన NUPOWER రెన్యూవల్స్ ఇప్పుడు లోన్ స్కామ్ లో కేంద్ర బిందువుగా మారింది. దీపక్ కొచ్చర్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ. ఇది 180 మెగావాట్ల విండ్ ఎనర్జీ తయారీ సామర్థ్యం కలిగి ఉంది. ఆదాయం తగ్గటంతో కంపెనీ లిక్విడిటీ దెబ్బతింది. ఈ కంపెనీలో వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ పెట్టుబడులు పెట్టడంతో చాలా విషయాలు బయటకు వచ్చాయి.

అరెస్టులు..

అరెస్టులు..

నెలల తరబడి విచారణ తర్వాత సీబీఐ చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వేణుగోపాల్‌ ధూత్‌లను అరెస్టు చేశారు. అయితే ఇప్పుడు సీబీఐ అధికారులు తమ విచారణ పరిధిని సైతం పెంచుతున్నారు. వీడియోకాన్ గ్రూప్ పొందిన మెుత్తం 10 రుణాలపై దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి సేకరిస్తోంది. వీటిలో నాలుగు కొచ్చర్ నేతృత్వంలో ఆమోదం పొందాయి.

ఇద్దరూ కలిసే..

ఇద్దరూ కలిసే..

కొచ్చర్ భర్త కంపెనీలో వీడియోకాన్ పెట్టుబడులు రుణాలు పొందటానికి ముందు జరిగాయి. అయితే చందా కొచ్చర్, వేణుగోపాల్ ధూత్ సంయుక్తంగా లోన్ మోసాలకు పాల్పడ్డారా లేదా అనే విషయం మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు మెుత్తం రుణాలపై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో జూన్ 2009 నుంచి అక్టోబర్ 2011 మధ్య కాలంలో రూ.1,875 కోట్ల విలువైన 6 రుణాలు మంజూరయ్యాయని సీబీఐ దర్యాప్తులో తేలింది.

చట్టాల ఉల్లంఘన..

చట్టాల ఉల్లంఘన..

కొచ్చర్ కి ముందు జారీ అయిన 6 రుణాలు కూడా మోసపూరితంగా జరిగాయని వెల్లడైతే ఐసీఐసీఐ భారీ ఎదురుదెబ్బను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొచ్చర్-ధూత్ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్లలో బ్యాంకింగ్ చట్టాల ఉల్లంఘన జరిగాయని సీబీఐ బలంగా నమ్ముతోంది. దీనిపై సీరియస్ గా దర్యాప్తు నిర్వహిస్తోంది. 2010-2012 మధ్య మెుత్తం కొచ్చర్ సమయంలో వీడియోకాన్ రూ.3,250 కోట్ల రుణాన్ని పొందింది.

సీబీఐ కనిపెట్టిన విషయాలు..

సీబీఐ కనిపెట్టిన విషయాలు..

లోన్ పొందిన తర్వాత వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ దీపక్ కొచ్చర్ కు చెందిన నూపవర్ రెన్యూవబుల్స్‌లో.. దాదాపు రూ.64 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దీనికి తోడు ముంబైలో రూ.5.25 కోట్ల విలువైన ఒక భూమిని కేవలం రూ.11 లక్షలకు కొచ్చర్ కుటుంబానికి విక్రయించినట్లు సీబీఐ కనిపెట్టింది. అక్రమాల డొంక మెుత్తం కదిపే పనిలో సీబీఐ సీరియస్ గా వర్క్ చేస్తోంది.

2023 జనవరి 15న కుమారుడి పెళ్లికి బెయిల్ కోరుతూ కొచ్చర్ కోర్టును ఆశ్రయించినప్పటికీ.. విషయం అంత అర్జంట్ కాదంటూ బాంబే హై కోర్టు పిటిషన్ ను తోసిపుచ్చింది.

Read more about: cbi icici
English summary

Videocon Scam: తీగ లాగుతున్న సీబీఐ.. మరిన్ని కష్టాల్లోకి చందా కొచ్చర్.. బండారం బయటకు..! | CBI Expanded Videocon scam case to 10 loans given, Chanda Kochaar bail rejected

CBI Expanded Videocon scam case to 10 loans given, Chanda Kochaar bail rejected
Story first published: Wednesday, January 4, 2023, 13:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X