For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ITR Filing: ఆదాయపు పన్ను దాఖలు గడువు పొడిగింపు.. కేంద్రం ప్రకటన.. పూర్తి వివరాలు

|

ITR Filing: ఆదాయపు పన్ను దాఖలుకు వ్యక్తులకు, వ్యాపారులకు వేరువేరుగా ఉంటాయి. 2022-23 సంవత్సరానికి వ్యాపార సంస్థలు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు నవంబర్ 7 వరకు పొడిగించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.

కంపెనీలు ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గతంలో చివరి తేదీ అక్టోబర్ 31గా ఉంది. ఆదాయ, కార్పొరేట్ పన్ను వ్యవహారాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నిర్వహిస్తుంది. గత నెలలో ఆడిట్ నివేదికల దాఖలు గడువును పొడిగించినందున.. తాజాగా ITR దాఖలు చేయడానికి గడువును కూడా పొడిగించినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది.

CBDT Extended ITR Filing Deadline To November 07,2022 For Companies

సాధారణంగా దేశీయ కంపెనీలు 2021-2022 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను అక్టోబర్ 31, 2022లోపు దాఖలు చేయాల్సి ఉంటుంది. పండుగల సీజన్‌లో వ్యాపార సంస్థల కోసం 2022-23కి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి నవంబర్ 7 వరకు గడువును పొడిగించడం చాలా అవసరమని AMRG & అసోసియేట్స్‌లో కార్పొరేట్ అండ్ ఇంర్నెషనల్ టాక్స్ డైరెక్టర్ ఓం రాజ్‌పురోహిత్ అన్నారు. భవిష్యత్తులో పన్నుల వ్యత్యాసాలను నివారించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary

ITR Filing: ఆదాయపు పన్ను దాఖలు గడువు పొడిగింపు.. కేంద్రం ప్రకటన.. పూర్తి వివరాలు | CBDT Extended ITR Filing Deadline To November 07,2022 For Companies

CBDT Extended ITR Filing Deadline To November 07,2022 For Companies
Story first published: Thursday, October 27, 2022, 10:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X