ప్రముఖ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని. గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో ఈ సంవత్సరంలో (2021) 30,000 మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. గత ఏడాది (2020)తో పోలిస్తే ఇది 25 శాతం అధికం. కరోనా నేపథ్యంలో వ్యాపార అవకాశాలు బుల్లిష్‌గా ఉంటాయని ఈ ఫ్రెంచ్ కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది ఐటీ సంస్థల్లో నియామకాలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి దేశీయ దిగ్గజాలు కూడా కొత్త ఉద్యోగులను గతంలో కంటే ఎక్కువగా తీసుకునే ప్లాన్ చేస్తున్నాయి.

ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‍కు
ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు అవకాశం కల్పించనుంది క్యాప్‌జెమిని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), క్లౌడ్, 5జీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్ అండ్ డీ, ఇంజనీరింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ నైపుణ్యాలలో నియమాకలను చేపట్టనున్నట్లు వెల్లడించింది. గత సంవత్సరంతో పోలిస్తే 25 శాతం ఎక్కువ అని క్యాప్ జెమిని సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. కోవిడ్ 19 నేపథ్యంలో డిజిటల్ సొల్యూషన్‌కు పెరిగిన భారీ డిమాండ్ తమ వ్యాపార తమ వ్యాపార అవకాశాలను మెరుగుపరిచిందన్నారు.

నియామకాలు - వృద్ధి
ఈ నియామకం 2021 సంవత్సరానికి గాను 7-9 శాతం మేరకు తమ బలమైన ఆదాయ వృద్ధికి మార్గదర్శకంగా మారుతుందని తెలిపారు. ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్ 50 శాతం చొప్పున తీసుకుంటామన్నారు. కాగ్నిజెంట్‌కు భారత్‌లో 1,25,000 ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు 2,70,000. భారత్‌లోనే ఉద్యోగులు ఎక్కువ. 2020లో భారత్‌లో ఈ కంపెనీ 24,000 మంది ఉద్యోగులను నియమించుకుంది.

ఇతర ఐటీ కంపెనీలు కూడా..
డిసెంబర్ క్వార్టర్‌లో క్యాప్‌జెమిని ఆదాయంలో 65% వాటా క్లౌడ్ బిజినెస్, డిజిటల్ సొల్యూషన్స్ నుండి ఉంది. కరోనా నుండి కోలుకుంటున్నందున వ్యాపారం తిరిగి పుంజుకుంటుందని భారీ డీల్స్ వస్తాయని భావిస్తోంది. ఏప్రిల్ 2020లో కరోనా సమయంలోను వేతన పెంపు ప్రకటించింది. ఇతర ఐటీ దిగ్గజాల విషయానికి వస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 24,000 మందిని తీసుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 మందిని తీసుకున్నది. కాగ్నిజెంట్ 23వేల ఉద్యోగులను తీసుకోనుంది. గత ఏడాదితో ఇది 35 శాతం అధికం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications