For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

12% వాటాతో లీడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తాం: బ్యాడ్ బ్యాంక్‌పై కెనరా

|

మొండి బకాయిలు వసూలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తోంది. దీనిని నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(NARCL) లేదా బ్యాడ్ బ్యాంకుగా పిలుస్తున్నారు. ఈ బ్యాడ్ బ్యాంకులో ప్రభుత్వరంగ కెనరా బ్యాంకు 12 శాతం వాటాను తీసుకోనుంది. ఈ మేరకు మంగళవారం తెలిపింది. ఈ బ్యాడ్ బ్యాంకులో 12 శాతం వాటా తీసుకోవడం ద్వారా లీడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తామని కెనరా బ్యాంకు తెలిపింది.

పరిష్కార ప్రణాళికలో ఉన్న రుణదాతల ఎన్పీఏలను కొనుగోలు చేసి, వాటికి పరిష్కారం చూపించే ఆర్థిక సంస్థగా బ్యాడ్ బ్యాంకు రూపుదిద్దుకుంటోంది. NARCLలో స్పాన్సర్‌గా చేరాలని కెనరా బ్యాంకును కోరుతూ మే 13వ తేదీన ది ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA) లేఖ రాసింది. ఇందుకు తమ బ్యాంకు బోర్డ్ సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు కెనరా బ్యాంకు రెగ్యులేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. ఆర్బీఐ నుండి అనుమతి తీసుకుని, 12 శాతం వాటాను NARCLలో తీసుకుని స్పాన్సర్ బ్యాంకుగా వ్యవహరిస్తామని పేర్కొంది.

 Canara Bank to buy 12 percent stake in Bad Bank

తమ ఎన్పీఏలను బ్యాడ్ బ్యాంకుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని పలు ప్రభుత్వరంగ బ్యాంకులు ఇప్పటికే వెల్లడించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.8,000 కోట్ల ఎన్పీఏలను బదిలీ చేస్తామని తెలిపింది. బ్యాడ్ బ్యాంకులో 51 శాతం వాటాను PSBs, మిగతా ప్రయివేటురంగ బ్యాంకులు తీసుకోనున్నాయి.

English summary

12% వాటాతో లీడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తాం: బ్యాడ్ బ్యాంక్‌పై కెనరా | Canara Bank to buy 12 percent stake in Bad Bank

Canara Bank said it will be the lead sponsor of National Asset Reconstruction Company Limited (bad bank) with 12 per cent stake in the entity.
Story first published: Wednesday, June 16, 2021, 9:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X