For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాప్ లేపిన కెనరా బ్యాంక్: లాభాలు రెండింతలు: డివిడెండ్‌కు సిఫారసు

|

ముంబై: కెనరా బ్యాంక్.. తన నాలుగో త్రైమాసిక ఫలితాలను కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఎక్స్ఛేంజ్‌కు సమర్పించింది. తన లాభాలను రెట్టింపు చేసుకుంది బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తోన్న బ్యాంక్. నాలుగో త్రైమాసికంలో నికర లాభాలతో పాటు వార్షిక వ్యాపార లావాదేవీల్లోనూ గణనీయమైన పురోగతిని అందుకుంది. నిరర్థక ఆస్తుల భారం కూడా కొంతమేర తగ్గించుకోగలిగింది.

జొమాటో ఫౌండర్ దాతృత్వం: ఫుడ్ డెలివరి సిబ్బంది, వారి పిల్లల కోసం రూ.700 కోట్లు విరాళంజొమాటో ఫౌండర్ దాతృత్వం: ఫుడ్ డెలివరి సిబ్బంది, వారి పిల్లల కోసం రూ.700 కోట్లు విరాళం

 1,666 కోట్లు లాభం..

1,666 కోట్లు లాభం..

ఎక్స్ఛేంజ్‌కు అందజేసిన ప్రతిపాదనల ప్రకారం.. కెనరా బ్యాంక్.. మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 1,666.22 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నమోదు చేసిన నెట్ ప్రాఫిట్ 1,010.87 కోట్ల రూపాయలు. కాగా ఈ సారి ఈ మొత్తం 1,666.22కు పెరిగింది. 63 శాతం వృద్ధిని రికార్డు చేసింది. జనవరి-ఫిబ్రవరి-మార్చి నెలల కాలంలో వచ్చిన మొత్తం ఆదాయం 22,323.11 కోట్ల రూపాయలు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఈ మొత్తం 21,040.63 కోట్ల రూపాయలు.

 ఎన్పీఏలో తగ్గుదల..

ఎన్పీఏలో తగ్గుదల..

అసెట్ క్వాలిటీ విషయానికి వస్తే- స్థూల నిరర్థక ఆస్తులు లేదా బ్యాడ్ లోన్స్ శాతం స్వల్పంగా క్షీణించింది. ఇదివరకు 8.93గా ఉన్న నిరర్థక ఆస్తుల పర్సెంటేజీ 7.51 శాతానికి తగ్గింది. మొత్తంగా ఈ ఎన్పీఏల విలువ 60,287.84 కోట్ల రూపాయల నుంచి రూ.55,651.58 కోట్ల రూపాయలకు తగ్గింది. నాలుగో త్రైమాసికాన్ని పరిగణనలోకి తీసుకుంటే నెట్ ఎన్పీఏ కూడా 3.82 నుంచి 2.65 శాతానికి తగ్గింది. బ్యాడ్ లోన్స్ 2,129.73 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. అయినప్పటికీ.. ఈ స్థాయిలో ఎన్పీఏలు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

డివిడెండ్‌కు సిఫారసు

డివిడెండ్‌కు సిఫారసు

మొత్తంగా 2021-2022 ఆర్థిక సంవత్సరంలో 85,907.15 కోట్ల రూపాయల మేర బ్యాంక్ లావాదేవీలను నిర్వహించింది. అంతకుముందు నాటి ఆర్థిక సంవత్సరం అంటే 2020-2021తో పోల్చుకుంటే ఈ మొత్తం అధికం. అప్పట్లో 84,204.78 కోట్ల రూపాయల మేర లావాదేవీలను రికార్డు చేసింది కెనరా బ్యాంక్. కాగా- ఈ పరిణామాల నేపథ్యంలో కెనరా బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు డివిడెండ్‌ ప్రకటించాలని సిఫారసు చేసింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6.50 పైసల మేర డివిడెండ్ ఇవ్వాలని సూచించింది.

 తగ్గిన షేర్ ధర..

తగ్గిన షేర్ ధర..

ఈ డివిడెండ్‌ను 2021-2022 ఆర్థిక సంవత్సరానికి పరిమితం చేసింది. కాగా- ఈ సిఫారసులను బ్యాంక్ యాజమాన్యం ఆమోదం తెలపాల్సి ఉంది. త్వరలో నిర్వహించబోయే వార్షిక సర్వసభ్య సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. కాగా- బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో కెనరా బ్యాంక్ షేర్ల ధరలు ఇవ్వాళ తగ్గుముఖం పట్టాయి. గురువారం సాయంత్రం ముగిసిన ట్రేడింగ్‌తో పోల్చుకుంటే మధ్యాహ్నానికి ఒక్కో షేర్ మీద రూ.4.72 పైసల మేర క్షీణత కనిపించింది. రూ.214.05 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది.

English summary

టాప్ లేపిన కెనరా బ్యాంక్: లాభాలు రెండింతలు: డివిడెండ్‌కు సిఫారసు | Canara Bank Q4 results: 65% jump in net profit as Rs 1,666 crore

Canara Bank reported a 65 per cent jump in its standalone net profit at Rs 1,666.22 crore for quarter ended March 2022.
Story first published: Friday, May 6, 2022, 15:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X