For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలా చేస్తే రూ.3750 కోట్లు వదిలేస్తాం! భారత్‌కు కెయిర్న్ 'అసలు' ఆఫర్

|

రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ తీర్పు మేరకు అసలు మొత్తం 1.2 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు భారత్ అంగీకరిస్తే, ఖర్చులు, వడ్డీ కింద చెల్లించాల్సిన 500 మిలియన్ డాలర్లు వదులుకుంటామని కెయిర్న్ ఎనర్జీ ప్రతిపాదించింది. అంతేకాదు, ఈ మొత్తాన్ని భారత ప్రభుత్వం గుర్తించిన చమురు-గ్యాస్ లేదా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో పెట్టుబడిగా పెడతామని తెలిపింది.

దీనిని వివాద్ సే విశ్వాస్ ద్వారా పరిష్కరించుకోవాలని కెయిర్న్‌కు భారత ప్రభుత్వం సూచించింది. ఈ ప్రతిపాదనను కెయిర్న్ తోసిపుచ్చింది. రెట్రోస్పెక్టివ్ పన్ను చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది. సానుకూల ఆదేశాలు వచ్చాయి.

Cairn offers to forego $500 mn if India agrees to pay principal due

హేగ్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఆదేశాలను కేంద్రం గౌరవిస్తే 500 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధమని తెలిపింది. 1994లో భార‌త్‌లోని ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్‌లో ఈ స్కాటిష్ కంపెనీ పెట్టుబ‌డులు పెట్టింది. ద‌శాబ్దం త‌ర్వాత బార్మార్‌లో భారీగా ఆయిల్ నిల్వ‌లు ఉన్న‌ట్లు క‌నుగొంది. 2006-07లో బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీగా కెయిర్న్ ఇండియా చేరింది. అయిదేళ్ల తర్వాత కేంద్రం రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ లాను ఆమోదించింది. దీని కింద కెయిర్న్‌కు వడ్డీ ప్లస్ పెనాల్టీతో కలిపి రూ.10,247 కోట్లు చెల్లించాలని బిల్లును ఖరారు చేసింది. కెయిర్న్ ఇండియా ఆస్తులు, ఫండ్స్, ఇతర ఆదాయ మార్గాలను జఫ్తు చేసింది. దీనిపై హేగ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కెయిర్న్.

English summary

అలా చేస్తే రూ.3750 కోట్లు వదిలేస్తాం! భారత్‌కు కెయిర్న్ 'అసలు' ఆఫర్ | Cairn offers to forego $500 mn if India agrees to pay principal due

As the tax battle intensifies between India and energy giant Cairn, with New Delhi challenging the $1.2-billion award at The Hague, the UK oil major has reached out to the Indian government through informal channels with a fresh proposal to settle the dispute, though with dim prospects of success.
Story first published: Monday, April 12, 2021, 20:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X