For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Uber Ride: రోడ్డు మీద విమానం ఛార్జీలు.. ముంబైలు ప్రయాణికులకు క్యాబ్ కష్టాలు.. వేల రూపాయలు..

|

High Cab Prices: భారత ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ప్రయాణాలు చాలా ఖరీదైనవిగా మారాయని వినియోగదారులు వాపోతున్నారు. ఇతర నగరాల ప్రజలకు అక్కడ జీవనం, ఆహారం పరంగా అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి. అయితే ముంబైలో ఇప్పుడు క్యాబ్ రైడ్‌లు ఏకంగా విమాన ఛార్జీలకు ఏమాత్రం తగ్గడం లేదు. పీక్ అవర్స్ లో క్యాబ్ కంపెనీలు ఛార్జీని విపరీతంగా పెంచేస్తుంటాయి. తాజాగా.. ఓ వ్యక్తికి ఉబర్ కంపెనీతో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అతను ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్‌లో టాక్సీని బుక్ చేసుకున్నాడు. ప్రయాణ ఛార్జీని చూసిన వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఉబెర్‌లో 50 కిలోమీటర్ల ప్రయాణానికి.. ఏకంగా రూ.3,000లకు పైగా ఛార్జ్ ఉంది. ఈ ఛార్జీలు చూసి దిమ్మతిరిగిన సదరు వినియోగదారుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అయితే తనకు ఎదురైన ఈ అనుభవాన్ని మాత్రం సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

దారుణంగా రైడ్ ధరలు..

ముంబైకి చెందిన శ్రవణ్‌కుమార్ అనే వ్యక్తి.. సువర్ణ దాదర్ నుంచి కళ్యాణ్‌కు ప్రయాణించటానికి క్యాబ్‌ను బుక్ చేసుకున్నాడు. అయితే ఛార్జీని చూసి ఒక్కసారిగా నివ్వెరపోయాడు. ఉబెర్ యాప్ హ్యాచ్‌బ్యాక్‌కు రూ.3,041, సెడాన్‌కు రూ.4,081, ఎస్‌యూవీకి రూ.5,159 ధరలను ఉబెర్ యాప్ చూపించింది. ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌వే హైవే మీదుగా దాదర్ నుంచి కళ్యాణ్‌కి ప్రయాణ దూరం దాదాపు 50 కి.మీ. అంటే.. ఉబర్‌లో 50 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.3,041 అనేది ఉబెర్ అందిస్తున్న చౌకైన రవాణా ఛార్జీ. మరీ ఇంత దారుణమా అంటూ.. శ్రవణ్‌కుమార్ తన కష్టాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ముంబైలో ఉబెర్ ప్రయాణం కంటే గోవాకు ఫ్లైట్ ఛార్జీ చవకగా ఉందంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

స్పందించని ఉబెర్..

స్పందించని ఉబెర్..

ఈ వ్యవహారంపై ఉబెర్ ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఛార్జీల పెరుగుదల అంటే సర్జ్ ధర అనేది డిమాండ్ అండ్ సరఫరా ఆధారంగా అల్గారిథమ్ పనిచేస్తుందని అగ్రిగేటర్ కంపెనీల వర్గాలు తెలిపాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో రైడర్ వర్షంలో క్యాబ్ బుక్ చేస్తున్నాడు. కానీ సరఫరా తక్కువగా ఉండటంతో ఇలా ఎక్కువ ధర వచ్చిందని వారు అంటున్నారు. రైడర్ జూన్ 30 రాత్రి 9.30 గంటల ప్రాంతంలో క్యాబ్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఉబెర్, ఓలా వంటి కంపెనీల్లో దాదాపుగా పరిస్థితి ఇలాగే ఉందని చాలా మంది ప్రయాణికులు వాపోతున్నారు.

ముంబై వాసుల మాటేంటి..

ముంబై వాసుల మాటేంటి..

గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి దాటిన తర్వాత ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్కోసారి రూ.1,000కు పైగా అద్దె ఉంటోంది. మనలో చాలా మంది అర్థరాత్రి ప్రయాణం కోసం అగ్రిగేటర్ క్యాబ్‌లపై ఆధారపడతారని క్యాబ్‌లో క్రమం తప్పకుండా ప్రయాణించే ఒక వ్యక్తి అన్నారు. పెరిగిన ధర మా కష్టాలను మరింత పెంచిందని ఆయన వెల్లడించాడు. మీరు అదృష్టవంతులైతే, మీరు సాధారణ ఛార్జీలకే క్యాబ్ దొరుకుతుందని అన్నాడు. వైరల్ అవుతున్న ట్వీట్ పై స్పందింస్తూ కొందరు నెటిజన్లు.. క్యాబ్‌లకు బదులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, బస్సుల్లో వెళ్లడానికి ఇష్టపడతామని అంటున్నారు. ఏ ప్రయాణానికైనా గరిష్ఠ ఛార్జీలను నిర్ణయించాలని వారు కోరుతున్నారు.

English summary

cab prices in mumbai city are costlier than goa flight ticket a user tweet going viral with high prices surge

cab prices in mumbai city are costlier than goa flight ticket
Story first published: Monday, July 4, 2022, 18:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X