For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PPF: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా.. పీపీఎఫ్‍తో రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు పొందండి..

|

ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులకు ఐటీ రిటర్న్స్ కు సంబంధించి వాళ్ల హెచ్ ఆర్ నుంచి మెయిల్స్ వచ్చి ఉంటాయి. అయితే ఉద్యోగులు కొన్ని పథకాల్లో చేరడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. పన్ను మినహాయింపు లభించే పథకాల్లో పీపీఎఫ్(పబ్లిక్ ప్రవిడెంట్ ఫండ్) ఒకటి. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

కనీసం రూ.500

కనీసం రూ.500

పీపీఎఫ్ అకౌంట్ ను పోస్టాఫీస్ లు, లేదా బ్యాంకుల్లో ఓపెన్ చేయవచ్చు. అయితే ఒక్కరు ఒక్క అకౌంట్ మాత్రమే తీయాలి. ఈ పథకంలో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ఠంగా రూ.1.5లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో ఖాతా 15 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఆ తర్వాత ఐదు సంవత్సరాల చొప్పున దీన్ని పొడిగించుకోవచ్చు.

15 ఏళ్ల లాక్‌ఇన్ పీరియడ్

15 ఏళ్ల లాక్‌ఇన్ పీరియడ్

అయితే కొంత సమయం తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ఖాతా నుంచి పాక్షికంగా నగదును తీసుకోవచ్చు. పీపీఎఫ్ 15 ఏళ్ల లాక్‌ఇన్ పీరియడ్ ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసిన 5వ ఏడాది పూర్తయిన తరువాత పీపీఎఫ్ ఎక్కౌంట్ నుంచి కొద్దిగా డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. పీపీఎఫ్ పథకం కింద ప్రస్తుతం ప్రభుత్వం 7.1 శాతం చొప్పున వడ్డీని అందిస్తోంది. ఏదైనా భారతీయ పౌరుడు ఎవరైనా పీపీఎఫ్‌లో ఖాతాను తెరవవచ్చు.

సెక్షన్ 80C

సెక్షన్ 80C

మీరు ఈ పథకంలో ప్రతి నెలా రూ.12,500 పెట్టుబడి పెడితే ఒక సంవత్సరంలో మీకు రూ.1.50 లక్షలు అవుతాయి. అంటే రోజుకు రూ.416 ఆదా చేసుకోవాలన్న మాట. అదే సమయంలో 15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ.22.50 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 40.70 లక్షలు అవుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 18.20 లక్షల వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుంది.

English summary

PPF: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా.. పీపీఎఫ్‍తో రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు పొందండి.. | By joining the PPF scheme, you can get a tax deduction of up to 1.5 lakhs

Currently, many employees have received mails from their HR regarding IT returns. However, employees can get tax exemption by joining certain schemes.
Story first published: Saturday, January 14, 2023, 14:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X