For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Electric Tandoors: తక్కువ పెట్టుబడితో ప్రతినెలా వేల రూపాయల్లో ఆదాయం

|

ఈ మధ్యకాలంలో భారీ యంత్రాలకు బదులుగా పోర్టబుల్ మిషన్లు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో ఫొటోకాపీ యంత్రాలు భారీగా ఉండేవి. క్రమంగా అవి పోర్టబుల్ జిరాక్స్ మిషన్లుగా మారాయి. పిండిమిషన్లు, వాటర్ ప్యూరిఫయర్లు పోర్టబుల్ అవతారంలో మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అదే క్రమంలో తందూర్ మిషన్లు కూడా చిన్నసైజులో లభ్యమౌతున్నాయి. వీటి ద్వారా చిరు వ్యాపారాలను నిర్వహించుకునే వెసలుబాటు ఉంది.

ఫుడ్ ఐటమ్స్‌లల్లో తందూర్‌కు ఉన్న ప్రాధాన్యతే వేరు. దాని టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. తందూర్ నాన్‌వెజ్, రోటీలకు మంచి డిమాండ్ ఉంది. పిజ్జాలను తయారు చేయడానికి కూడా తందూర్ మిషన్లు అవసరమౌతాయి. మైక్రోఓవెన్స్ కంటే కూడా చవగ్గా లభిస్తోన్నాయి. అచ్చంగా- బొగ్గు మీద కాల్చిన రుచిని అందించడం ఎలక్ట్రిక్ తందూర మిషన్ ద్వారా వండిన వంటకాల ప్రత్యేకత. నాన్ వెజ్, వెజ్, పిజ్జా, నాన్ రోటీ, పరోఠాలతో పాటు మంచి రెసిపీలను కూడా దీని ద్వారా తయారు చేసుకునే అవకాశం ఉంది.

 Business Ideas: Electric Tandoors is healthy and cost-effective cooking for making profitable too.

చాలా నగరాల్లో ఈ ఎలక్ట్రిక్ తందూర్ మిషన్ల ఆధారంగా పిజ్జా సెంటర్లు సైతం వెలిశాయి. పిజ్జా బేస్‌ను కొనుగోలు చేస్తే.. మిగిలినవన్నీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి ఈ తందూర్ మిషన్ ఉపయోగపడుతుంది. ఇందులో సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ వేరియంట్స్ ఉన్నాయి. ధరలో కూడా తేడా ఉంది. ఆటోమేటిక్ వేరియంట్‌లో టైమర్ ఉంటుంది. సెమీ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ తందూర్ మిషన్ 5,000 రూపాయలకే లభిస్తుంది. ఆటోమేటిక్ తందూర్ మిషన్ మాత్రం కాస్త ఖరీదే. 35,000 రూపాయలు ఉంటుంది.

వీటి ద్వారా రెడీమేడ్ నాన్ రోటీ, పరోఠా, పిజ్జాలను తయారు చేసి విక్రయించవచ్చు. బల్క్ ఆర్డర్లను సైతం తీసుకోవచ్చు. ఇదే తందూర్ మిషన్ మీద ఆధారపడి ఓ చిన్న సైజ్ రెస్టారెంట్‌ను కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. దీని మీద కొంత పబ్లిసిటీ చేసుకోగలిగితే- ప్రతినెలా వచ్చే ఆదాయం వేల రూపాయల్లో ఉంటుంది. తాముండే ప్రాంతాలు, బంధుమిత్రుల ఇళ్లల్లో జరిగే నివాసాల్లో జరిగే సెలబ్రేషన్స్‌కు టేస్టీ ఫుడ్ ఐటమ్స్‌ను సరఫరా చేయవచ్చు.

Read more about: business ideas
English summary

Electric Tandoors: తక్కువ పెట్టుబడితో ప్రతినెలా వేల రూపాయల్లో ఆదాయం | Business Ideas: Electric Tandoors is healthy and cost-effective cooking for making profitable too

Business Ideas: Electric Tandoors is healthy and cost-effective cooking for making profitable too.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X