For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Business Idea: మెడికల్ కొరియర్‌గా ప్రతినెలా రూ. వేలల్లో ఆదాయం: ఇంకెందుకు ఆలస్యం

|

ఆన్‌లైన్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తరువాత- ప్రతి వస్తువునూ ఇంటి వద్దకే తెప్పించుకోవడానికి అలవాటు పడ్డారు లక్షలాది మంది వినియోగదారులు. ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక్క ఆన్‌లైన్ క్లిక్‌తో- తినే తిండి మొదలుకుని కట్టుకునే బట్టల వరకు అన్నీ గుమ్మం వద్దకే అందుతున్నాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్, దానికి ఇంటర్నెట్ వసతి ఉంటే చాలు.. కాలు బయట పెట్టకుండా అన్ని పనులు చక్కబెట్టుకునే స్థితి ఏర్పడింది.

ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ భారత్‌లో ఇంత త్వరగా బలంగా వేళ్లూనుకోవడానికి, జిల్లా కేంద్రాలు, పట్టణాల వరకూ వ్యాప్తి చెందాయంటే దీనికి కారణం- ఆన్‌లైన్ డెలివరీలే. ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ డోర్ డెలివరీ వ్యవస్థ ఇప్పుడు పట్టణాల వరకూ విస్తరించింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు కొత్తగా మెడికల్ కొరియర్ సర్వీస్ అందుబాటులో వచ్చింది. సాధారణ కొరియర్ సర్వీసుల గురించి మనకు తెలిసిందే అయినప్పటికీ.. మెడికల్ కొరియర్ సర్వీసు బలంగా వేళ్లూనుకుంటోంది.

Business Idea: మెడికల్ కొరియర్‌గా ప్రతినెలా రూ. వేలల్లో ఆదాయ

వస్తువులను కొరియర్ చేసినట్టుగానే మెడిసిన్స్, టాబ్లెట్స్, సిరప్స్.. దీనికి అనుబంధ వస్తువులను కూడా కొరియర్ చేయడానికి అందుబాటులోకి వచ్చిన ప్రత్యేకమైన నెట్‌వర్క్ ఇది. అయిదారు వేల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్‌తో ఈ సర్వీస్‌ను మనం ప్రారంభించవచ్చు. ఓ టూవీలర్, స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటే చాలు. ఇందులో మంచి లాభాలు ఉంటున్నాయని, అతి త్వరలో ఈ నెట్‌వర్క్ విస్తరిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అపోలో, మెడ్‌ప్లస్ వంటి బిగ్ షాట్స్‌తో పాటు పలు మెడికల్ ఏజెన్సీలు, షాప్‌ల వారు ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లను తీసుకుంటున్న విషయం తెలిసిందే. వాటిని కస్టమర్లకు డోర్ డెలివరీ చేయడానికి సిబ్బంది అత్యవసరం. డోర్ డెలివరీ బాయ్స్ లేనిదే ఈ కొరియర్ నెట్‌వర్క్ అనేది ఏ మాత్రం సక్సెస్ కాలేదు. అందుకే- అలాంటి మెడికల్ కొరియర్ డోర్ డెలివరీ సర్వీస్‌ను సొంతంగా పెట్టుకోగలిగితే- ప్రతినెలా మంచి లాభాలను ఆర్జించే వీలు ఉంది.

ఈ సర్వీసులను ఆరంభించడానికి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. తాము మెడికల్ కొరియర్ సర్వీస్‌ను ప్రారంభించినట్లుగా ప్రచారం చేసుకోగలిగితే చాలు. దీనికో మంచి పేరు, విజిటింగ్ కార్డ్, షాప్ నుంచి మెడిసిన్స్ కొనుగోలు చేసిన తరువాత దాన్ని క్లయింట్ వద్దకు చేర్చడానికి అవసరమైన ప్యాకింగ్, వీలైతే బ్రాండ్‌నేమ్‌ను ముద్రించివున్న టీషర్ట్ ధరించితే ఇంకా మేలు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు.

మెడిసిన్ అవసరమైన వ్యక్తి నుంచి డాక్టర్ రాసిచ్చిన ప్రిస్కిప్షన్‌ను మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వాట్సప్ ద్వారా కూడా తీసుకోవచ్చు. ఆ ప్రిస్కిప్షన్‌లో రాసివున్న మెడిసిన్స్‌ను షాప్ నుంచి కొనుగోలు చేసి, మళ్లీ క్లయింట్‌కు అప్పగించాల్సి ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీస్, టౌన్‌షిప్‌, పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లను తమ నెట్‌వర్క్ పరిధిలోకి చేర్చుకోగలిగితే- డబ్బులే డబ్బులు. ఫోన్ ద్వారా ఆర్డర్ ఇవ్వడానికి కనీసం కొంతమొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుదని లేదా.. బిల్లింగ్ అమౌంట్‌లో కొంత కమీషన్‌ ద్వారా గానీ మనం క్లయింట్ల వద్ద నుంచి నగదును పొందవచ్చు. స్థానిక మెడికల్ షాప్‌తో మనం టైఅప్ చేసుకోగలిగితే అక్కడి నుంచి కమీషన్ రూపంలో కొంత నగదును తీసుకోవచ్చు.

English summary

Business Idea: Zero investment business on Medical Courier Service: here is the details

Zero investment business on Medical Courier Service: here is the details.
Story first published: Friday, May 13, 2022, 16:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X