For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Business Idea: ఇంటింటికీ పెట్రోల్ డెలివరీతో డబ్బులే డబ్బులు

|

ముంబై: పెట్రోల్.. డీజిల్. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా బండి నడవదు. బైక్ బయటికి తీసే ముందు అందులో ఇంధనం ఉందా? లేదా అని చూసుకుంటుంటాం. పొరపాటున పెట్రోల్ లేకపోతే- ఆ తరువాత పడే తిప్పలు వర్ణనాతీతం. పెట్రోల్ బంక్ వరకూ బైక్‌ను నెట్టుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల సమయం వృధా అవుతుంది. అనవసర శ్రమ కూడా. ఈ పరిస్థితి లేకుండా చమురు కంపెనీలు కొత్తగా ఫ్యూయెల్ డోర్ డెలివరీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

ఫ్యూయెల్ డోర్ డెలివరీ..

ఫ్యూయెల్ డోర్ డెలివరీ..

పెట్రోల్, డీజిల్‌ను ఇంటింటికీ డోర్ డెలివరీ చేయడాన్ని ప్రారంభించాయి. యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న వినియోగదారులకు ఇంటి వద్దకే పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేస్తోన్నాయి. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తొలుత దీన్ని ప్రారంభించాయి. బీపీసీఎల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని.. పెట్రోల్‌, డీజిల్‌ను ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఫెసో క్యాన్‌ ద్వారా వాటిని సరఫరా చేస్తుంది బీపీసీఎల్. దీనివల్ల ప్రమాదం సంభవించే అవకాశం లేదు.

 డీపీఆర్ తప్పనిసరి..

డీపీఆర్ తప్పనిసరి..

ఈ విధానం ఇప్పుడు ఓ బిజినెస్‌లా మారింది. ఆన్‌లైన్ పెట్రోల్, డీజిల్ డెలివరీ, డోర్ టు డోర్ బిజినెస్‌ను ఎవ్వరైనా ప్రారంభించవచ్చు. ఇందులో మంచి ఆదాయం ఉంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించదలిచిన వారు తొలుత- ఆయా కంపెనీలను సంప్రదించాల్సి ఉంటుంది. పెట్రోలియం ప్రాసెస్ ఇంజినీరింగ్ సర్వీస్ కంపెనీని కూడా సంప్రదించవచ్చు. ఆ తరువాత చమురు కంపెనీలు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను అందజేయాలని సూచిస్తాయి.

డీపీఆర్‌పై చమురు కంపెనీల ఆమోదం..

డీపీఆర్‌పై చమురు కంపెనీల ఆమోదం..

తాము చేపట్టదలచుకున్న పెట్రోల్-డీజిల్ డోర్ డెలివరీపై పూర్తిస్థాయిలో ఓ డీపీఆర్‌ను రూపొందించి.. చమురు కంపెనీలకు అందజేయాలి. ఈ డీపీఆర్ అత్యంత కీలకం. ఇది నచ్చితేనే- చమురు కంపెనీలు ఈ బిజినెస్‌ను ప్రారంభించడానికి అనుమతి ఇస్తాయి. చమురు కంపెనీలు డీపీఆర్‌కు ఆమోదం తెలిపిన వెంటనే దీనికి సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టొచ్చు. ఇందులో భాగంగా తొలుత ఓ యాప్‌ను రూపొందించుకోవాల్సి ఉంటుంది.

యాప్ ద్వారా ఆర్డర్..

యాప్ ద్వారా ఆర్డర్..

ఈ యాప్ ద్వారానే పెట్రోల్, డీజిల్ ఆన్‌లైన్ ఆర్డర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్‌ను చేపట్టదలిచిన ప్రాంతంలో ఓ మినీ సర్వేను నిర్వహించడం మంచిది. దీనివల్ల ఇన్వెస్టర్లకు ఓ అంచనా ఏర్పడుతుంది. ఏ కంపెనీకి చెందిన పెట్రోల్, డీజిల్‌ను స్థానికులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారనేది తెలుస్తుంది. ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారనేది ఈ సర్వే ద్వారా తెలుసుకోవచ్చు. తాము ఇంధనం ఆన్‌లైన్ డోర్ డెలివరీ బిజినెస్ చేపట్టినట్లు తెలియజేయడానికి సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకోవచ్చు.

కమీషన్ల రూపంలో ఆదాయం..

కమీషన్ల రూపంలో ఆదాయం..

ఇది కొంత ఖర్చుతో కూడుకున్న వ్యాపారమే అయినప్పటికీ.. మంచి లాభాలు ఉన్నాయి. బల్క్‌గా ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాన్ని వినియోగదారుల ఇళ్ల వద్దకు తరలించడానికి ఓ వాహనాన్ని సైతం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యాప్ తయారీ తప్పనిసరి. చమురు సంస్థల నుంచి కమీషన్ రూపంలో ఆదాయం అందుతుంది. నోయిడా, గుర్‌గావ్, మంగళూరు వంటి పలు నగరాల్లో స్టార్టప్స్ రూపంలో ఈ వ్యాపారాన్ని పలువురు ఆరంభించారు కూడా.

English summary

Business Idea: ఇంటింటికీ పెట్రోల్ డెలివరీతో డబ్బులే డబ్బులు | Business Idea: The Fuel Delivery, door-to-door fuel delivery service provider will make you profitable

The Fuel Delivery, an app-based door-to-door fuel delivery service provider, has announced the launch of its operations in Bengaluru, which is the third city after Delhi and Mumbai to get services.
Story first published: Saturday, April 30, 2022, 12:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X