For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2022: హెల్త్ ఇన్సురెన్స్ పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారా?

|

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ పైన వేతనజీవుల నుండి వివిధ వర్గాలు ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సురెన్స్, ఎంపిక చేసిన ఆరోగ్య ఖర్చులకు ఆదాయపు పన్ను మినహాయింపును అందిస్తుంది. హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియం 60 ఏళ్లలోపు వ్యక్తులకు రూ.25,000 వరకు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి రూ.50,000 వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి, మీపై ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రుల కోసం చెల్లించిన ప్రీమియం కోసం మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కోసం రూ.5000 వరకు చెల్లించేందుకు రూల్స్ అనుమతిస్తాయి. దీనికి పన్ను మినహాయింపు ఉంది.

వ్యక్తిగత పొదుపు నుండి చెల్లింపు

వ్యక్తిగత పొదుపు నుండి చెల్లింపు

ప్రభుత్వ గణాంకాల ప్రకారం 70 శాతానికి పైగా ఆరోగ్య సంరక్షణ వ్యక్తిగత పొదుపు నుండి చెల్లిస్తారు. సెక్షన్ 80డీ కోసం ప్రభుత్వానికి రెండు లక్ష్యాలు ఉండాలి. ఆరోగ్య బీమాను కొనుగోలు చేసేలా ఎక్కువమంది వ్యక్తులను ప్రోత్సహించడం, వారికి సరైన మొత్తంలో బీమా హామీని కొనుగోలు చేయడం. ఇందుకు సెక్షన్ 80డీలోని ఆదాయపు పన్ను మినహాయింపులను రెట్టింపు చేయాలి. ప్రస్తుత పన్ను మినహాయింపులు తగినంత ఆరోగ్య బీమా కొనుగోలును ప్రోత్సహించవు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అన్ని ఆరోగ్య బీమా ఉత్పత్తులు, పన్ను మినహాయింపులు కింద చూడండి..

వివిధ ఉత్పత్తులు

వివిధ ఉత్పత్తులు

- Family floater(రూ.20 లక్షల సమ్ అస్యూర్డ్, eldest age 30 (1)) - సెక్షన్ 80డీ మినహాయింపు పరిమితి 25,000 - 45 ఉత్పత్తులు - యావరేజ్ ప్రీమియం రూ.28,700

- Family floater(రూ.5 లక్షల సమ్ అస్యూర్డ్, eldest age 45 (2)) - సెక్షన్ 80డీ మినహాయింపు పరిమితి 25,000 - 86 ఉత్పత్తులు - యావరేజ్ ప్రీమియం 23,200

- ఇండివిడ్యువల్స్ ఇన్సురెన్స్ (45 ఏళ్లకు పైన, ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు) - సెక్షన్ 80డీ మినహాయింపు పరిమితి 25,000 - 73 ఉత్పత్తులు - యావరేజ్ ప్రీమియం రూ.30,600

- Family floater(రూ.20 లక్షల సమ్ అస్యూర్డ్, eldest age 45) - సెక్షన్ 80డీ మినహాయింపు పరిమితి 25,000 - 73 ఉత్పత్తులు - యావరేజ్ ప్రీమియం రూ.32,400

- Family floater(రూ.20 లక్షల సమ్ అస్యూర్డ్, eldest age 45) 25,000 45 42,800

- Individual Insurance (45 ఏళ్లకు పైన, ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.20 లక్షలు) - సెక్షన్ 80డీ మినహాయింపు పరిమితి 25,000 - 45 ఉత్పత్తులు - యావరేజ్ ప్రీమియం రూ.44,000

- Individual Insurance(60 ఏళ్లకు పైన, ఇద్దరికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు) - సెక్షన్ 80డీ మినహాయింపు పరిమితి 50,000 - 73 ఉత్పత్తులు - యావరేజ్ ప్రీమియం రూ.63,000

- Individual Insurance( 75 ఏళ్లకు పైన, ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇద్దరికి - సెక్షన్ 80డీ మినహాయింపు పరిమితి 50,000 - 16ఉత్పత్తులు - యావరేజ్ ప్రీమియం రూ.95,000

- Individual Insurance(75 ఏళ్లు, ఒక్కొక్కరికి రూ.10 లక్షలు మొత్తం ఇద్దరికి) - సెక్షన్ 80డీ మినహాయింపు పరిమితి 50,000 - 18 ఉత్పత్తులు - యావరేజ్ ప్రీమియం రూ.126,624

పన్ను మినహాయింపు పరిమితి

పన్ను మినహాయింపు పరిమితి

కరోనా మహమ్మారి నేపథ్యంలో హెల్త్ ఇన్సురెన్స్, లైఫ్ ఇన్సురెన్స్ ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో 2022 బడ్జెట్‌లో సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా కోసం పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

English summary

Budget 2022: హెల్త్ ఇన్సురెన్స్ పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారా? | Budget 2022 must hike tax exemption limit for health insurance under Section 80D

Section 80D of the Income-tax Act, 1961 provides income tax exemption for health insurance premium and select health expenses.
Story first published: Monday, January 17, 2022, 15:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X