For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budget 2021: సంపన్నులకు ఈ బడ్జెట్‌లో సెస్ షాక్?

|

ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రేపు (ఫిబ్రవరి 1, సోమవారం) బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్‌లో కొవిడ్ సెస్ లేదా సర్‌ఛార్జీని తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ వ్యయం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి ఆదాయం తగ్గడంతో పాటు ఖర్చులు భారీగా పెరిగాయి. ఇప్పుడు వ్యాక్సినేషన్ కోసం అదనపు ఖర్చు అవసరమైంది. గత ఏడాది జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. అయితే రెండు మూడు నెలలుగా కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబడిని పెంచుకోవడం కోసం సెస్ లేదా సర్‌ఛార్జీని విధించవచ్చునని అంటున్నారు.

బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి

వసూళ్లు

వసూళ్లు

అన్ని రకాల పన్నులు తగ్గడంతో రాబడి కోసం సంపన్నులపై సెస్‌ను విధించడంతోపాటు ఇంధనాలపై అదనపు సెస్, పరోక్ష పన్నుల పెంపు ఉండవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం కొవిడ్ సెస్‌ను అమలు చేస్తే ప్రభుత్వ రాబడి పెరిగే అవకాశముంది. కేంద్రం సెస్ వసూళ్లను రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ దిశగా ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. మరోవైపు, కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఉందని, ఈ సమయంలో కొత్త పన్నులు విధించవద్దని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి.

రాష్ట్రాలు సెస్.. కోర్టుకు టాటా

రాష్ట్రాలు సెస్.. కోర్టుకు టాటా

కరోనా నేపథ్యంలో అదనపు ఖర్చులకు నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే కేవలం అధిక ఆదాయ ఆర్జన కలిగిన వారికి ఇది ఉంటుందని కూడా చెబుతున్నారు. కరోనా సమయంలో పలు రాష్ట్రాలు కోవిడ్ సెస్‌ను ప్రవేశ పెట్టాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు గత ఏడాది మే 5న ఢిల్లీ ప్రభుత్వం మద్యం పైన 70 శాతం స్పెషల్ కరోనా ఫీజు విధించింది. జూలై అనంతరం జార్ఖండ్ ప్రభుత్వం ప్రతి టన్ను బొగ్గుపై రూ.10, ఇనుక ఖనిజంపై రూ.5 వసూలు చేసింది. ఈ చర్యకు వ్యతిరేకంగా టాటా స్టీల్ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది.

ఎనిమిదో బడ్జెట్

ఎనిమిదో బడ్జెట్

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశ పెడుతోంది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బడ్జెట్ పైన వివిధ రంగాలు ఆశలు పెట్టుకుంది. కరోనా, లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈసారి పన్ను మినహాయింపులపై ఆశలు ఉన్నాయి. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద మినహాయింపు పరిమితి రూ.1.5 లక్షల నుండి రూ.2 లక్షల నుండి రూ.3 లక్షల వరకు పెంచవచ్చునని అంచనాలు ఉన్నాయి.

English summary

Budget 2021: సంపన్నులకు ఈ బడ్జెట్‌లో సెస్ షాక్? | Budget 2021: Centre may introduce COVID 19 cess to make up for pandemic spending

The Central government may introduce a coronavirus cess or surcharge on individual taxpayers in the Union Budget 2021 slated to be announced by Finance Minister Nirmala Sitharaman on February 1.
Story first published: Sunday, January 31, 2021, 11:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X