For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్‌పై 'బంగారమం'త ఆశలు, సుంకాలు ఎంత తగ్గించవచ్చు?

|

ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో దాదాపు అన్ని రంగాలకు ఊతమిచ్చేలా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. గత బడ్జెట్‌లో బంగారంపై ఉన్న ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు. మందగమనంతో పాటు ఈ పెంపు కారణంగా కూడా వినియోగం తగ్గింది. ఈ నేపథ్యంలో ఈసారి బంగారం డిమాండ్ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఈ వర్గాలు కోరుతున్నాయి.

వారికి రూ.40,000 కోట్ల రీఫండ్‌ను బ్లాక్ చేసిన కేంద్రం..వారికి రూ.40,000 కోట్ల రీఫండ్‌ను బ్లాక్ చేసిన కేంద్రం..

తగ్గిన పసిడి దిగుమతులు

తగ్గిన పసిడి దిగుమతులు

భారత్ ప్రతి సంవత్సరం దాదాపు 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో 22.16 బిలియన్ డాలర్లుగా నమోదయింది. పెరుగుతున్న కరెంట్ అకౌంట్ లోటును కట్టడి చేసేందుకు బంగారంపై సుంకాలు పెంచింది. దీంతో దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య దిగుమతులు 7 శాతం తగ్గి 20.57 బిలియన్ డాలర్లకు తగ్గింది. వజ్రాభరణ దిగుమతులు కూడా 1.5 శాతం మేర క్షీణించాయి.

ఇలా మరింత భారం

ఇలా మరింత భారం

ఈ నేపథ్యంలో డిమాండ్ పెంచేలా సుంకాలు తగ్గించాలని ఈ వర్గాలు కోరుతున్నాయి. బంగారంపై 10 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 12.5 శాతానికి పెంచింది. దీనికి జీఎస్టీ అదనం. దీంతో కొనుగోలు మరింత భారం కావడంతో వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గింది.

6 శాతానికి తగ్గించండి

6 శాతానికి తగ్గించండి

బంగారంపై దిగుమతి సుంకాలను 6 శాతానికి తగ్గించాలని ఈ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. కట్, పాలిష్డ్, డైమెండ్స్ పైన సుంకాలను 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలని కోరుతున్నాయి.

క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే..

క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే..

కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులు వినియోగిస్తే బ్యాంకుకు వెళ్లే కమీషన్లు తగ్గించాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న 1 శాతం నుంచి 1.5 శాతం ఉంది. దీనిని 0.20 శాతానికి తగ్గించాలని కోరుతున్నాయి.

క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్

క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్

ఆభరణాలు విక్రయిస్తే వచ్చిన మొత్తాన్ని కొత్త ఆభరణాల్లో ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాయి. పాన్ కార్డ్ రిక్వయిర్‌మెంట్ పరిమితిని కూడా పెంచాలని కోరుతున్నారు.

English summary

బడ్జెట్‌పై 'బంగారమం'త ఆశలు, సుంకాలు ఎంత తగ్గించవచ్చు? | Budget 2020: Jewellers want cut in import duty of gold and in income tax

Jewellers are expecting a reduction in import duty of gold and a cut in income tax for the common people in the upcoming Budget to spur demand. At present gold attracts an import duty of 12.5% and a GST of 3%.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X