For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

BSNL 5G: ఆందోళనలో జియో, ఎయిర్ టెల్.. బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు.. 11,705 ఉద్యోగాలు..?

|

BSNL 5G: దేశంలో 2జీ కుంభకోణం తర్వాత బీఎస్ఎన్ఎల్ వ్యాపారం వేగం చాలా తగ్గింది. దీనికి ముందు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ప్రైవేటు రంగాన్ని మించి లాభాలను ఆర్జించింది. కానీ అమాంతం నష్టాల్లోకి జారుకుని కోలుకోలేని స్థితికి చేరుకుంది. ఈ తరుణంలో చాలా కాలం తర్వాత మళ్లీ BSNL తన వేగాన్ని పెంచింది. ప్రస్తుతం 4జీ సేవలు అందించే పనిలో ఐటీ దిగ్గజం టీసీఎస్ సాయంతో ముందుకు సాగుతోంది.

బీఎస్ఎన్ఎల్ 5జీ..

బీఎస్ఎన్ఎల్ 5జీ..

ప్రస్తుతం TCS, C-DOT కన్సార్టియం సాయంతో 4జీ సాంకేతిక ఆధారిత టెలికాం సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తోంది. ఈ తరుణంలో కేంద్ర టెలికాం మంత్రి అష్వినీ వైష్ణవ్ బీఎస్ఎన్ఎల్ 5జీ సేవల గురించి ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం టీసీఎస్ సాయంతో నిర్మితమవుతున్న పూర్తి స్వదేశీ 4జీ సాంకేతికతను భవిష్యత్తులో మెరుగుపరిచి కొత్త తరం సాంకేతికత సేవలను అందిస్తామని వెల్లడించారు.

5జీ సేవలు అప్పటి నుంచే..

5జీ సేవలు అప్పటి నుంచే..

జియో అరంగేట్రానికి ముందు దేశంలో అత్యంత నమ్మకమైన టెలికాం సేవల కంపెనీగా బీఎస్ఎన్ఎల్ ఉంది. అయితే అంబానీ పోటీకి తట్టుకోలేక మూతపడుతుందని అందరూ భావించారు. కానీ ఈ ఊహలను దాటుకుని కొత్త జవసత్వాలతో బీఎస్ఎన్ఎల్ సేవలను అందించటానికి సిద్ధమౌతోంది. 2024 నాటికి దేశంలో ప్రభుత్వ టెలికాం సంస్థ తన 5జీ టెలికాం సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుందని కేంద్ర మంతి వైష్ణవ్ స్పష్టం చేశారు.

ఒడిశాలో మాట్లాడుతూ..

ఒడిశాలో మాట్లాడుతూ..

ఒడిశాలో జియో, ఎయిర్‌టెల్‌ 5జీ సేవలను ప్రారంభించే కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో మాట్లాడుతూ 2024లో BSNL 5G సేవలను ప్రారంభించనుందని వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి శ్రీ వైష్ణవ్ సేవలను ప్రారంభించారు. రెండేళ్లలో ఒడిశా మెుత్తం 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఒడిశాలోని 100 గ్రామాలను కవర్ చేస్తూ 4జీ సేవల కోసం 100 టవర్లను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ రాష్ట్రంలో టెలికాం కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు మోదీ ప్రభుత్వం రూ.5,600 కోట్లు కేటాయించిందని వైష్ణవ్ పేర్కొన్నారు.

జియోకి ఎదురుదెబ్బేనా..?

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికిన జియో.. బీఎస్ఎన్ఎల్ రాకతో నష్టపోతుందా అనే అంశం ఇప్పుడు చర్చకు దారితీసింది. దీనికి తోడు ఇతర ప్రైవేట్ ఆపరేటర్లైన వొడఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ కూడా కస్టమర్లను కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఇది టెలికాం రంగంలో పోటీని పెంచటంతో పాటు కంపెనీలకు ఆర్థికంగా కష్టకాలానికి దారితీస్తుందని వారు భావిస్తున్నారు. అయితే ప్రజలకు బీఎస్ఎన్ఎల్ సరసమైన ధరలకు టెలికాం సేవలను అందుబాటులోకి తెస్తుందని అంచనా వేస్తున్నారు.

BSNL JTO ఉద్యోగాలు..

BSNL JTO ఉద్యోగాలు..

బీఎస్ఎన్ఎల్ JTO కింద 11,705 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిందంటూ వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఇది పూర్తిగా అసత్య ప్రచారమని తేలింది. ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దని BSNL స్పష్టం చేసింది.

English summary

BSNL 5G: ఆందోళనలో జియో, ఎయిర్ టెల్.. బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు.. 11,705 ఉద్యోగాలు..? | BSNL to start 5G services from 2024 Says Union Telecom Minister Ashwini Vaishnaw

BSNL to start 5G services from 2024 Says Union Telecom Minister Ashwini Vaishnaw
Story first published: Friday, January 6, 2023, 10:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X