కరోనా మహమ్మారి నేపథ్యంలో అంతర్జాతీయవ్యాప్తంగా విమానాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి. ఈ వైరస్ కారణంగా భారీగా దెబ్బతిన్న రంగాల్లో విమానయానం, పర్యాటకరంగం ఉన్నాయి. దీంతో మన దేశంలో ఎయిరండియా సహా వివిధ సంస్థలు తమ ఉద్యోగులకు వేతన తగ్గింపును ప్రకటించాయి. అయితే బ్రిటిషన్ ఎయిర్వేస్ సంస్థ మాత్రం పెద్ద ఎత్తున ఉద్యోగులను తాత్కాలికంగా తగ్గించేందుకు సిద్ధమైందట. అయితే కొంత వేతనం ఇవ్వనుంది.

తాత్కాలిక తొలగింపు
కరోనా నేపథ్యంలో బ్రిటీష్ ఎయిర్వేస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి కారణంగా ఏప్రిల్, మే మాసాల్లో బ్రిటీష్ ఎయిర్వేస్ 75% విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమాన సర్వీసుల రద్దు వల్ల బ్రిటీష్ ఎయిర్వేస్‌లో పని చేస్తున్న 28 వేలమంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తూ వారిని ఆదుకోవాలని నిర్ణయించారు.

వేతనంలో తగ్గింపు
విమానయాన రంగం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది. తమ ఉద్యోగులకు వీలైనంత సాయం చేసేలా మంచి ఒప్పందం అమలు చేస్తామని ఏవియేషన్ జాతీయ అధికారి తెలిపారు. 80 శాతం వేతనం ఇవ్వవచ్చునని తెలుస్తోంది. యూకే ప్రభుత్వం బ్రిటిష్ ఎయిర్వేస్ సబ్బందికి 3,095 డాలర్ల ఫండ్‌ను నేషనల్ ప్యాకేజీ కింద సమకూర్చే అవకాశముందని తెలుస్తోంది.

36వేలమంది ఉద్యోగులు
బ్రిటిష్ ఎయిర్వేస్ 36వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు మీడియాలో ఇటీవల వార్తలు వచ్చాయి. ఇందులో 80 శాతం మంది బ్రిటిష్ ఎయిర్వేస్ క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, ఇంజినీర్స్, హెడ్ ఆఫీస్‌లో పని చేసేవారు ఉన్నారు. అంటే వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసి ఎనభై శాతం శాలరీ ఇస్తుంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications