For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది: BP ఇండియా హెడ్

|

కేజీ బేసిన్ నుండి మలిదశ ఉత్పత్తి ప్రారంభం కానున్న నేపథ్యంలో యూకేకు చెందిన కంపెనీ BP మౌలికసదుపాయాల షేరింగ్ పైన దృష్టి సారించింది. వ్యయాలు తగ్గించుకోవడానికి, గ్యాస్ ఉత్పత్తిదారులు సహకరించాలని, మౌలిక వసతులను పుంచుకోవాలని కోరింది. తక్కువ మొత్తం ఆవిష్కరణలను నగదీకరణ చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. లక్ష్యం కంటే ఎక్కువ ఉత్పత్తి సాధిస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలని, అపరాధ రుసుములు విధించరాదని బీపీ కంపెనీ భారత చీఫ్ శశి ముకుందన్ అన్నారు. ఇండియా ఎనర్జీ ఫోరమ్ ఆఫ్ సెరావీక్‌లో పాల్గొని, ప్రసంగించారు.

రోజుకు రూ.1 లక్ష: వివిధ డెబిట్ కార్డులపై SBI ఏటీఎం క్యాష్ ఉపసంహరణ పరిమితి...రోజుకు రూ.1 లక్ష: వివిధ డెబిట్ కార్డులపై SBI ఏటీఎం క్యాష్ ఉపసంహరణ పరిమితి...

నాకు ఆశ్చర్యం వేసింది

నాకు ఆశ్చర్యం వేసింది

ఉత్తమ అంతర్జాతీయ పద్ధతులను, విధానాలను అనుసరించడం ద్వారా దేశీయ చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి మద్దతివ్వాలని శశిముకుందన్ అన్నారు. జరిమానాలు విధించడం కంటే ఉత్పత్తి లక్ష్యం కంటే ఎక్కువగా ఉండేందుకు ప్రోత్సాహకాలు ఉండాలన్నారు. తాను భారత్ విషయానికి వచ్చినప్పుడు ఓ విషయాన్ని గమనించానని, అప్ స్ట్రీమ్ కంపెనీలు కలిసి రావడం కానీ, మౌలిక వసతులను పంచుకోవడం కానీ భారత్‌లో కనిపించడం లేదని, ఇది తనకు ఆశ్చర్యం వేసిందన్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో బీపీ, రాయల్ డచ్ షెల్ కలిసిన అంశాన్ని గుర్తు చేశారు.

వైవిధ్యమైన ఆలోచన అవసరం

వైవిధ్యమైన ఆలోచన అవసరం

ఏదైనా కాంట్రాక్టులోని నిబంధనలను కూడా పాటించాలని, గౌరవించాలన్నారు. భారత్‌లో భారీ నిక్షేపాలు లేనందున మధ్య, చిన్న నిక్షేపాల నుండి ఉత్పత్తిని రాబట్టేందుకు వైవిధ్యంగా ఆలోచించాలన్నారు. ఒప్పందాల పవిత్రత, విధాన స్థిరత్వం ఉండాలన్నారు. ఓసారి నిర్దిష్ట ఒప్పందం, నిర్దిష్ట ఫ్రేమ్‌వర్క్ కింద ఇన్వెస్ట్ చేస్తే దానిని అలాగే కొనసాగించడం ముఖ్యమన్నారు. కాగా, బీపీ సంస్థ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో కేజీ-డీ6 బ్లాకులో రూ.500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతోంది.

భారత్ డిమాండ్‌లో 15 శాతం

భారత్ డిమాండ్‌లో 15 శాతం

చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు, దిగుమతులు తగ్గించేందుకు సహాయపడే కార్యక్రమాలపై దృష్టి సారించాలని ముకుందన్ అన్నారు. గడిచిన ఆరేళ్లలో ఈ ప్రభుత్వం సరళీకృత, ఫాస్ట్ ట్రాక్ ప్రక్రియలపై దృష్టి సారించిందని గుర్తు చేశారు. రిలయన్స్-బీపీ మూడు ఫీల్డ్‌లలో అభివృద్ధి చేసేందుకు 5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు కట్టుబడి ఉన్నాయని, ఇవి రోజుకు 30 మిలియన్ల ప్రామాణిక క్యూబిక్ ఫీట్ల ఉత్పత్తిని చేస్తాయని, 2022-23లో భారత్ డిమాండ్‌లో 15 శాతం, ఉత్పత్తిలో 25 శాతం ఉండాలని భావిస్తున్నట్లు తెలిపారు.

English summary

భారత్‌లో లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది: BP ఇండియా హెడ్ | BP pitches for infra sharing with cos like ONGC

Ahead of starting the next wave of gas production from the KG basin, UK-based supermajor BP Plc has pitched for oil and gas producers sharing their infrastructure to help cut costs and monetise small and marginal discoveries.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X