For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా పెట్టుబడులు: మన స్టార్టప్స్‌కు దెబ్బ.. అలా చేస్తే ఇబ్బందికరమే!

|

పేటీఎం, జొమాటో, ఉడాన్, బిగ్ బాస్కెట్ తదితర భారతీయ ప్రముఖ స్టార్టప్స్‌లలో చైనా నుండి పెద్దమొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుండి స్టార్టప్స్‌ల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆశక్తి చూపకపోవడం లేదా భారత్ లేదా ఇక్కడి కంపెనీ నిర్ణయాలతో పెట్టుబడులు సమీకరించేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది.

Boycott China Products: ఒప్పో ఖరీదైన స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు సెగBoycott China Products: ఒప్పో ఖరీదైన స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు సెగ

చైనీస్ పెట్టుబడులు

చైనీస్ పెట్టుబడులు

ఇప్పటికే రిటైల్ సంస్థలు, భారతీయులు చైనా వస్తువులను బ్యాన్ చేయాలని ఉద్యమిస్తున్నారు. చైనా - భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో స్టార్టప్‌లలోకి పెట్టుబడుల ప్రభావంపై ప్రముఖ ఇంగ్లీష్ వెబ్ సైట్ ఆరా తీసింది. ఈ అంశంపై పారిశ్రామికవేత్తలు, కంపెనీలు మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. కొంతమంది రిస్క్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు మాత్రం పోర్ట్‌పోలియోలో మార్పులు కోరుతున్నారు. బెంగళూరుకు చెందిన రూ.800 కోట్ల అసెట్స్ కలిగిన ఓ వెంచర్ క్యాపిటల్ సంస్థ దాని పరిమిత భాగస్వాముల జాబితాలో చైనా లేదా చైనాకు చెందిన పెట్టుబడిదారులను చేర్చలేదు.

పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతారా

పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతారా

ఈ పరిస్థితులు ప్రారంభంలో లేదా ఎదుగుతున్న కంపెనీలకు ఇబ్బందికరమని చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు వెనక్కి వెళ్లే అవకాశాలు లేవని కూడా అంటున్నారు. కానీ ప్రస్తుత సంక్షోభం మాత్రం స్టార్టప్స్‌ను దెబ్బతీస్తుందంటున్నారు. 2019లో చైనా పెట్టుబడిదారులు 3.9 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. 2018లో ఇది 2 బిలియన్ డాలర్లుగా ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి ఈ పెట్టుబడులు రావడం కాస్త ప్రయోజనం చేకూర్చిందని చెబుతున్నారు.

స్టార్టప్స్‌కు ఇబ్బందే.. కానీ ప్రమాదకరం

స్టార్టప్స్‌కు ఇబ్బందే.. కానీ ప్రమాదకరం

ఇండియాతో సరిహద్దును పంచుకునే దేశాల నుండి వచ్చే పెట్టుబడులకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చైనీస్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లు కొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విధానంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చైనా నుండి పెట్టుబడులు రాకుంటే విదేశీ నిధులపై ఆధారపడి కార్యకలాపాలు సాగిస్తున్న స్టార్టప్స్‌కు ఎదురుదెబ్బ అంటున్నారు. చైనా దుందుడుకు చర్యల వల్ల దేశంలో ప్రస్తుతం ఆ దేశ వ్యతిరేక గాలులు వీస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో చైనా నుండి ఏదైనా మూలధనాన్ని అంగీకరించడం ఏ సంస్థకైనా ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు.

English summary

చైనా పెట్టుబడులు: మన స్టార్టప్స్‌కు దెబ్బ.. అలా చేస్తే ఇబ్బందికరమే! | Boycott China Products: Startups China funds may dry up

India’s top startups, including Paytm, Zomato, Udaan and BigBasket, and the wider ecosystem that counts Chinese investors among their largest backers, are likely to face further hurdles in raising capital, as the anti-China rhetoric gets amplified following the ongoing military standoff between the two counties.
Story first published: Thursday, June 18, 2020, 20:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X