భారత్ సైకిల్ మార్కెట్ లీడర్ హీరో సైకిల్స్ చైనాకు భారీ షాకిచ్చింది. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో బాయ్‌కాట్ చైనీస్ ప్రోడక్ట్ ఉద్యమం ప్రారంభమైన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున వ్యాపారులు, సంస్థలు చైనా ఉత్పత్తులను పక్కన పెడతామని చెబుతుండగా, తాము కొనుగోలు చేయమని మెజార్టీ ప్రజలు చెబుతున్నారు. దీనికి అదనంగా జాతీయ భద్రత కోసం ప్రభుత్వం కూడా 59 యాప్స్‌ను నిషేధించింది. రహదారుల నిర్మాణంలో చైనాను పక్కన పెడదామని చెబుతున్నాయి.

హీరో సైకిల్స్ కీలక నిర్ణయం
ఇలాంటి కీలక సమయంలో హీరో సైకిల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో చేసుకున్న రూ.900 కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు హీరో సైకిల్స్ కంపెనీ చైర్మన్, ఎండీ పంకజ్ ముంజల్ ప్రకటించారు. ఒప్పందం ప్రకారం రానున్న 3 నెలల్లో చైనాతో రూ.900 కోట్ల వ్యాపారం చేయాల్సి ఉందని, దీనిని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమంలో తామూ కలుస్తామని చెప్పారు.

కొత్త మార్కెట్ కోసం అన్వేషణ
చైనీస్ భాగస్వాములతో సంబంధాలను రద్దు చేసుకున్న నేపథ్యంలో కొత్త మార్కెట్ కోసం అన్వేషిస్తున్నట్లు పవన్ ముంజాల్ తెలిపారు. యూరోప్ మార్కెట్లను అందిపుచ్చుకునే ఉద్దేశ్యంతో జర్మనీలో ప్లాంట్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇది చైనాకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు చెప్పారు. హీరో ఎలక్ట్రో ఈ-సైకిల్ ప్రాజెక్టులో 72 శాతం షేర్లు భారత్‌కు చెందినవేనని చెప్పారు.

చైనాకు చెక్.. వీటికి టెక్నికల్ సపోర్ట్
చైనా తీరుపై అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో సైకిల్ పరిశ్రమకు చెందిన వ్యాపారవేత్తలు బిజినెస్ విస్తరణ కోసం వియత్నాం, థాయ్‌లాండ్, తైవాన్ వంటి దేశాల వైపు చూస్తున్నారన్నారు. గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా సైకిల్స్‌కు డిమాండ్ పెరిగిందని, ఈ డిమాండ్‌కు అనుగుణంగా తమ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా ప్రతికూల ప్రభావం పడిన చిన్న కంపెనీలపై పవన్ ముంజాల్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు కొన్ని సంస్థలకు టెక్నికల్ సపోర్ట్ అందించడం ద్వారా చైనా నుండి దిగుమతి అవుతున్న హై-ఎండ్ సైకిల్ భాగాలను తయారు చేస్తాయి.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications