For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Employee Fired: 7 ఏళ్లలో తొలిసారి ఆలస్యంగా వచ్చిన ఉద్యోగి డిస్మిస్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న సహోద్యోగులు..

|

Employee Fired: చాలా మంది ఆఫీసుకు వెళ్లేవారికి అడపాదడపా ఆలస్యమైన సందర్భాలు ఉంటూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో ఇది సర్వసాధారణం. ట్రాఫిక్ వంటి ఇబ్బందులు కూడా ఇందుకు ఒక కారణంగా ఉన్నాయి. ఎంత కంగారుగా బయలుదేరి వెళ్లినా కొన్నిసార్లు ఆలస్యం అనివార్యం.

ఊహకందని సంఘటన..

ఊహకందని సంఘటన..

7 సంవత్సరాల్లో మొదటిసారిగా ఆలస్యంగా ఉద్యోగిని కంపెనీ తొలగించిందనే వార్త వింట్ షాక్ కలగక మానదు. నమ్మసక్యంగా లేకున్నా ఇది మాత్రం నిజం. యదార్థ సంఘటన కూడా. అయితే.. ఓదార్పునిచ్చే విషయం ఏంటంటే.. తొలగించిన ఉద్యోగికి సహోద్యోగులు కూడా మద్దతు పలికారు.

సోషల్ మీడియాలో వైరల్..

తొలగించబడిన వ్యక్తి తిరిగి ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. 7 ఏళ్లలో ఎప్పుడూ ఆలస్యంగా వెళ్లని ఉద్యోగి గత వారం 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్లటం వల్ల కంపెనీ చర్యలు తీసుకుంది. సదరు ఉద్యోగిని తొలిసారి విధుల నుంచి తొలగించింది. ఈ విషయాన్ని Reddit సోషల్ మీడియా వేదికలో వైరల్ గా మారింది.

సహోద్యోగుల యాక్షన్ ప్రకటన..

సహోద్యోగుల యాక్షన్ ప్రకటన..

ఈ కారణంగా ఆగ్రహించిన సహోద్యోగులు సదరు ఉద్యోగికి ఆసరాగా నిలిచారు. తొలగించిన ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకునే వరకూ తామూ ఆఫీస్ కు ఆలస్యంగా వస్తామని ప్రకటించారు. దీంతో తొలగించబడిన ఉద్యోగి తిరిగి నియమించబడ్డాడు. ట్రాఫిక్ లో చిక్కుకోవటమే ఈ ఉద్యోగి ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది.

English summary

Employee Fired: 7 ఏళ్లలో తొలిసారి ఆలస్యంగా వచ్చిన ఉద్యోగి డిస్మిస్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న సహోద్యోగులు.. | Boss fires employee for being 20 min late to office in 7 years. Here's what his colleagues did

A boss fired an employee who was late to office for first time in 7 years know how others supported
Story first published: Friday, August 5, 2022, 15:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X