For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?

|

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం గం.11 సమయానికి పార్లమెంటులో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో నిర్మలమ్మ ప్రవేశ పెడుతున్న బడ్జెట్ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బడ్జెట్ పైన వివిధ రంగాలు ఆశలు పెట్టుకోవడంతో పాటు, ఏం ఉంటుందనే ఆసక్తి చాలామందిలో నెలకొంది. బడ్జెట్ పైన వివిధ అంచనాలు కూడా ఉన్నాయి. భారత్ దిగుమతి టారిఫ్ స్ట్రక్టర్ పునరుద్ధరణపై అంచనాలు ఉన్నాయి.

Budget 2021: బడ్జెట్‌కు సంబంధించి మరిన్ని కథనాలు

వీటిపై సుంకాలు తగ్గవచ్చు

వీటిపై సుంకాలు తగ్గవచ్చు

లార్జ్ ఇన్‌పుట్స్ పైన తక్కువ సుంకం ఉండవచ్చునని, ముఖ్యంగా ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో ఉపయోగించబడేవాటిని పునరుద్ధరించవచ్చునని, అయితే ఫినిష్డ్ గూడ్స్ పైన సుంకాలు అధికంగానే ఉండవచ్చునని, ఇది డొమెస్టిక్ వ్యాల్యూ పెరుగుదలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. మిథైల్ అల్కాహాల్, అసెటిక్, పీవీసీ వంటి రసాయనాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఇన్‌పుట్స్ సుంకాలు తగ్గవచ్చునని అంటున్నారు.

పీవీసీని బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్, హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఇతర పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. హస్తకళల కోసం కీలకమైన ముడిసరుకు వుడ్ పైన కూడా భారం తగ్గవచ్చు.

వీటిపై పెరగవచ్చు

వీటిపై పెరగవచ్చు

రబ్బర్, లెదర్, ప్లాస్టిక్‌తో తయారు చేసిన కొన్ని ఫినిష్డ్ గూడ్స్ పైన దిగుమతి సుంకాలు పెరగవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం రబ్బరు ఉత్పత్తులపై దిగుమతి సుంకం 3 శాతం నుండి 20 శాతం, లెదర్ ఉత్పత్తులపై 10 శాతం నుండి 30 శాతం, ప్లాస్టిక్ ఉత్పత్తులపై 10 శాతం నుండి 15 శాతంగా ఉంది. మేకిన్ ఇండియాను ప్రోత్సహించేందుకు వీటిని పెంచవచ్చునని అంటున్నారు. తక్కువ సుంకాలు ఉన్న పలు దిగుమతి ఉత్పత్తులపై టారిఫ్ పెంచడానికి కారణం దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకే. ఏసీలు, టీవీ సెట్స్ వంటి వాటిపై పెరగనున్నాయి.

పీఎల్ఐ స్కీం

పీఎల్ఐ స్కీం

ఏసీలు, ఎల్ఈడీలు, ఎంటర్‌ప్రైజ్ ఎక్విప్‌మెంట్స్, స్విచ్‌లు, రూటర్స్ వంటి వాటి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ (PLI) స్కీంను ప్రారంభించింది. కొన్ని టెలికం పరికరాలపై కూడా దిగుమతి సుంకాన్ని పెంచాలనే డిమాండ్లు వచ్చాయని తెలుస్తోంది.

English summary

ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే? | Boost to local manufacturing: Budget 2021 may raise duty on finished goods

India’s import tariff structure could be revamped in the upcoming budget to provide lower duty on large inputs, especially those used in products that are exported, while keeping levies high on finished goods—a structure that would encourage domestic value addition.
Story first published: Friday, January 22, 2021, 14:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X