BMW sports bike: కళ్లు చెదిరే ఫీచర్స్: జస్ట్ రూ.3,999 ఈఎమ్ఐకే
ముంబై: ఆటొమొబైల్ బిగ్‌షాట్ బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ దేశీయ మార్కెట్లో కొత్త బైక్‌ను ఇంట్రడ్యూస్ చేయడానికి సమాయాత్తమౌతోంది. బీఎమ్‌డబ్ల్యూ జీ310 ఆర్‌ఆర్ పేరుతో ఈ బైక్ మార్కెట్‌లోకి రానుంది. దీనికి బుకింగ్స్ కూడా ఆరంభం అయ్యాయి. బైక్ కొనుగోలు చేయాలనుకునే వారు ఆన్‌లైన్ లేదా కంపెనీ ఆథరైజ్డ్ డీలర్ వద్ద బుక్ చేసుకోవచ్చు.
ఈ కొత్త బైక్ ఆధునిక ఫీచర్స్ అదే రేంజ్‌లో కళ్లు చెదిరే డిజైన్‌ను కలిగి ఉంది. బీఎండబ్ల్యూ యాజమాన్యం ఈ బైక్‌ను జులై 15వ తేదీన లాంచ్ చేయనుంది. 3,999 రూపాయల ఈఎమ్ఐతో దీన్ని కొనుగోలు చేయవచ్చు. బీఎమ్‌డబ్ల్యూ జీ310 ఆర్‌ఆర్ బైక్ ఎంట్రీ-లెవల్ ప్రీమియం. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 మోడల్‌ను పోలి ఉంటుంది దీని డిజైన్.
లుక్స్ పరంగా రెండూ దాదాపుగా ఒకేలా కనిపించినప్పటికీ.. కొన్ని స్పెసిఫిక్ ఫీచర్లలో చాలా వ్యత్యాసం ఉంటోంది. పవర్‌ట్రెయిన్, సస్పెన్షన్ వంటి వాటిలో తేడా ఉంటుంది. దీని ఎక్స్టీరియర్ డిజైన్ లుక్స్ అదరగొట్టాయి. బ్లూ, రెడ్ కలర్ వేరియంట్ ఎం స్టైల్ గ్రాఫిక్స్, సిగ్నేచర్ వైట్ పెయింట్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

అపాచి ఆర్ఆర్ 310 బైక్‌లో ఉండే 313 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను ఈ బైక్‌కు అమర్చారు. 9,700 రివాల్యూషనరీ పర్ మినిట్‌ను కలిగివుంది. 34 బీహెచ్‌పీ పవర్‌తో 7,700- ఆర్పీఎం 27.3 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బైక్. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ దీని ప్రత్యేకత.
ఈ కొత్త బీఎమ్‌డబ్ల్యూ జీ310 ఆర్‌ఆర్ బైక్ ధర ఎంత అనేది కంపెనీ యాజమాన్యం ఇంకా వెల్లడించలేదు. దీన్ని సస్పెన్స్‌గానే ఉంచింది. వచ్చే నెల లాంచింగ్ సమయంలోనే ధరను కూడా రివీల్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ బైక్ దేశీయ మార్కెట్లో ప్రధానంగా టీవీఎస్ కంపెనీ అపాచీ ఆర్ఆర్310కి ప్రధాన కాంపిటీటర్‌గా ఉంటుందని అంటున్నారు.
దీనితోపాటు కవాసకి నింజా 300, కేటీఎం ఆర్సీ 390, వంటి ఇతర మోడల్స్‌కు కూడా గట్టిపోటీ ఇస్తుందనిి మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బీఎండబ్ల్యూ నుంచి వస్తోండటం వల్ల దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రత్యేకించి- ధర ఎలా ఉంటుందనేది ఉత్కంఠతను రేపుతోంది. ఈఎంఐని ఖరారు చేసిన కంపెనీ యాజమాన్యం ధరపై మాత్రం సస్పెన్స్‌ను కొనసాగించడం పోటీలో భాగమేనని అంటున్నారు.