For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాస్‌డాక్‌లో లిస్టింగ్ ఎఫెక్ట్: 64,000 డాలర్లు.. సరికొత్త శిఖరాలకు బిట్‌కాయిన్

|

క్రిప్టోకరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా బుధవారం (ఏప్రిల్ 14) రోజున మొదటిసారి 64,000 డాలర్ల మార్కును క్రాస్ చేసింది. మార్చి నెలలో 61వేల డాలర్లను క్రాస్ చేసి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఇప్పుడు ఆ రికార్డును కూడా తుడిపేసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరుగుతుండటంతో వీటి వ్యాల్యూ పెరుగుతోంది. క్రిప్టోలో బిట్ కాయిన్ ప్రధానమైనది. కాబట్టి దీని విలువ ఎగిసిపడుతోంది. నేడు 1.6 శాతం ఎగిసి 64,207 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. కరోనా అనంతరం క్రిప్టోకరెన్సీకి ఎగిసిపడుతోంది.

హోమ్‌లోన్ వడ్డీ రేట్లపై కస్టమర్లకు కొటక్ మహీంద్రా గుడ్‌న్యూస్: అందుకే.. అలాగేహోమ్‌లోన్ వడ్డీ రేట్లపై కస్టమర్లకు కొటక్ మహీంద్రా గుడ్‌న్యూస్: అందుకే.. అలాగే

సరికొత్త రికార్డులు

సరికొత్త రికార్డులు

బిట్ కాయిన్ ఇటీవల ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మంగళవారం ఓ దశలో ఏకంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా 63,600 డాలర్ల (దాదాపు రూ.47.75 లక్షలు)ను తాకింది. నేడు 64,000 డాలర్లు క్రాస్ చేసింది. నాస్‌డాక్‌లో అమెరికా క్రిప్టో ఎక్సేంజ్ కాయిన్‌బేస్ నమోదు కానున్న నేపథ్యంలో బిట్‌కాయిన్‌పై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. 2021లో బిట్ కాయిన్ దాదాపు 120 శాతం ఎగిసింది.

కుదేలు.. జంప్

కుదేలు.. జంప్

2018లో బిట్ కాయిన్ కుదేలయింది. గత ఏడాది క‌రోనా మ‌హ‌మ్మారి నేపథ్యంలో సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం, క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. దీంతో వీటి ధరలు పెరిగాయి. క్రిప్టోకరెన్సీ కింగ్‌గా ఉన్న బిట్ కాయిన్ వ్యాల్యూ 5వేల నుండి 64వేలకు వచ్చింది. గత ఏడాది అక్టోబ‌ర్ నెలలో 12 వేల డాల‌ర్లుగా ఉన్న బిట్ కాయిన్ వ్యాల్యూ గ‌త నెల‌లో 60 వేల డాల‌ర్లు క్రాస్ చేసింది.

ఇవి కూడా కారణం

ఇవి కూడా కారణం

కాయిన్‌బేస్ ఏప్రిల్ 14న 100 బిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్‌తో నాస్‌డాక్‌లో లిస్టింగ్ అవుతోంది. క్రిప్టోకు వాల్ స్ట్రీట్ యాక్సెషన్ మరింత పెరుగుతుండటం కలిసి వస్తోంది. ఇప్పటికే గోల్డ్ మన్ శాక్స్ గ్రూప్ ఇంక్, మోర్గాన్ స్టాన్లీ వంటి కంపెనీలు తమ క్లయింట్స్‌కు క్రిప్టో పెట్టుబడుల యాక్సెస్‌కు పచ్చజెండా ఉపాయి. టెస్లా ఇంక్ బిట్ కాయిన్‌లో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.

English summary

నాస్‌డాక్‌లో లిస్టింగ్ ఎఫెక్ట్: 64,000 డాలర్లు.. సరికొత్త శిఖరాలకు బిట్‌కాయిన్ | Bitcoin touches $64,000 high as traders eye coinbase listing

Bitcoin advanced Wednesday, breaching the $64,000 level for the first time after eclipsing its most recent record in March a day earlier as the mood in cryptocurrencies turned bullish ahead of Coinbase Global Inc.’s listing this week.
Story first published: Wednesday, April 14, 2021, 15:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X