For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్‌కాయిన్ వ్యాల్యూ 4.2 శాతం జంప్, 50,948 డాలర్లకు..

|

క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ ఆదివారం నాడు 4.18 శాతం ఎగిసి 50,947.94 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే నేడు 2,043.31 డాలర్లు పెరిగింది. ఈ ఏడాది జనవరి 4వ తేదీన 27,734 డాలర్ల వద్ద ఉన్న ప్రపంచ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ఈ కాలంలో 83.7 శాతం లాభపడి 58,354.14 డాలర్లకు ఎగిసింది. ఆ తర్వాత గత పది సెషన్లుగా ఈ క్రిప్టో వ్యాల్యూ అంతకంతకూ పడిపోయింది.

బిట్ కాయిన్ వ్యాల్యూ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. బిట్ కాయిన్ వ్యాల్యూ ఆల్ టైమ్ గరిష్టం 58,000 నుండి ఓ సమయంలో 37 శాతం క్షీణించింది. తిరిగి మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు 50వేల డాలర్లు క్రాస్ చేసింది.

Bitcoin rises 4.2 per cent to $50,947.94

బిట్ కాయిన్ కొనుగోలు పెరగడంతో 2021 మార్చి 1వ తేదీ నాటికి దీని మార్కెట్ వాటా 61.11 శాతంగా నమోదయింది. 2013 నాటికి బిట్ కాయిన్ మార్కెట్ వాటా 94 శాతంగా ఉంది. అంటే ఈ ఎనిమిదేళ్లలో బిట్ కాయిన్ దాదాపు 35 శాతం మార్కెట్ వాటాను కోల్పోయింది. బిట్ కాయిన్ వాటా పడిపోవడానికి ప్రధానంగా పోటీ డిజిటల్ కరెన్సీలు రావడమే. కొన్నేళ్లుగా కొత్త కొత్త డిజిటల్ కరెన్సీల మార్కెట్లోకి వస్తున్నాయి.

English summary

బిట్‌కాయిన్ వ్యాల్యూ 4.2 శాతం జంప్, 50,948 డాలర్లకు.. | Bitcoin rises 4.2 per cent to $50,947.94

Bitcoin rose 4.18 % to $50,947.94 on Sunday, adding $2,043.31 to its previous close. Bitcoin, the world's biggest and best-known cryptocurrency, is up 83.7% from the year's low of $27,734 on Jan. 4. The currency's peak this year was $58,354.14 on Feb. 21.
Story first published: Sunday, March 7, 2021, 18:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X