ఎగిసి'పడ్డ' బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఎలా ఉందంటే
క్రిప్టో మార్కెట్ నేడు పుంజుకుంది. అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ కూడా నేడు ప్రారంభంలో లాభపడినప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఇరవై నాలుగు గంటల్లో 2.29 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది 2.41 శాతం పెరుగుదల. మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ వ్యాల్యూమ్ గత ఇరవై నాలుగు గంటల్లో 83.54 బిలియన్ డాలర్లుగా నమోదయింది.
వాజీర్ ఎక్స్ ప్రకారం బిట్ కాయిన్ ఉదయం రూ.38 లక్షల వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుతం డిజిటల్ కరెన్సీ మార్కెట్లో బిట్ కాయిన్ వాటా 40.69 శాతంగా ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో ఈ వాటా 0.04 శాతం పెరిగింది. యూఎస్టీ క్యాపిటలైజేషన్ 9 బిలియన్ డాలర్లుగా ఉంది. దీని కౌంటర్ పార్ట్ దాయ్ మార్కెట్ క్యాప్ 8.9 బిలియన్ డాలర్లుగా ఉంది. టెథేర్ మార్కెట్ క్యాప్ 77 బిలియన్ డాలర్లు, యూఎస్డీ కాయిన్ 42 బిలియన్ డాలర్లు, బియాన్స్ యూఎస్డీ మార్కెట్ క్యాప్ 14 బిలియన్ డాలర్లు పెరిగింది.

నేటి ఉదయం వరకు వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ భారత కరెన్సీలో... బిట్ కాయిన్ రూ.38,67,414, ఎథేరియం రూ.3,18,015, టెథేర్ రూ.78.69, కార్డానో
రూ.101.9495, ఎక్స్‌పీఆర్ రూ.75.2003, బియాన్స్ కాయిన్ రూ.41,977.61, పోల్కాడాట్ రూ.2035, డోజీకాయిన్ రూ.13.5625గా ఉంది.
అయితే సాయంత్రానికి ఇందులో కొన్ని క్రిప్టోల వ్యాల్యూ తగ్గింది. ఇందులో బిట్ కాయిన్ రూ.36,75,952కు పడిపోయింది. క్రితం సెషన్‌తో పోలిస్తే రూ.29,271 క్షీణించింది. అయితే ఉదయంతో పోలిస్తే మాత్రం దాదాపు లక్ష తగ్గింది.