For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్, ఎథేరియం 2000కు పైనే

|

క్రిప్టో కరెన్సీ కాస్త కోలుకుంది. గత కొద్ది రోజులుగా 30,000 డాలర్ల దిగువనే కదలాడుతున్న ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ నేడు ఈ మార్కును క్రాస్ చేసింది. రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 2,000 డాలర్లకు పైనే ఉంది. నేడు దాదాపు అన్ని పెద్ద క్రిప్టోలు కూడా ఒక శాతం నుండి 5 శాతం మేర లాభపడ్డాయి.

బిట్ కాయిన్ నేడు ఈ వార్త రాసే సమయానికి 30,387 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 29,646 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 30,622 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ 1.18 శాతం లాభపడింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 578.73 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆల్ టైమ్ గరిష్టం 68,990.90 డాలర్లు కాగా, 52 వారాల కనిష్టం 25,402.04 డాలర్లు. బిట్ కాయిన్ వరుసగా వారం పాటు భారీగా నష్టపోయిన అనంతరం, ఇప్పుడు కోలుకుంది. 2011 తర్వాత వారం భారీ లాంగ్ నష్టం ఇదే.

 Bitcoin recovers to $30,000 after longest run of weekly losses since 2011

వివిధ క్రిప్టో వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 1.22 శాతం లాభపడి 30,393 డాలర్లు, ఎథేరియం 2.13 శాతం ఎగిసి 2,065 డాలర్లు, ఎక్స్‌ఆర్‌పీ 1.48 శాతం ఎగిసి 0.425064 డాలర్లు, సోలానా 4.21 శాతం ఎగిసి 53.81 డాలర్లు, క్రిప్టో డాట్ కామ్ 3.31 శాతం ఎగిసి 0.1999 డాలర్లు, కార్డానో 1 శాతం ఎగిసి 0.550 డాలర్లు, స్టెల్లార్ 0.81 శాతం ఎగిసి 0.1368 డాలర్లు, అవాలాంచె 3.84 శాతం లాభపడి 32 డాలర్లు, పోల్కాడాట్ 1.87 శాతం ఎగిసి 10.39 డాలర్లు, డోజీకాయిన్ 1.20 శాతం లాభపడి 0.0874 డాలర్లు, షిబా ఇను 3.99 శాతం ఎగిసి 0.000012 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

English summary

30,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్, ఎథేరియం 2000కు పైనే | Bitcoin recovers to $30,000 after longest run of weekly losses since 2011

Bitcoin, the world's biggest and best-known cryptocurrency, rose 1.7% to $30,425 level where it’s been mostly hovering since the collapse of the TerraUSD algorithmic stablecoin triggered a selloff in cryptos.
Story first published: Monday, May 23, 2022, 18:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X