For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ 8వసారి 50% వరకు పతనం, మళ్లీ ఎగిసిపడుతోంది

|

క్రిప్టో కరెన్సీ నేడు ప్రారంభంలో నష్టపోయి, ఆ తర్వాత లాభపడింది. టాప్ సెవన్ క్రిప్టోల్లో ఆరు కూడా క్షీణించి, సాయంత్రానికి పుంజుకున్నాయి. సోమవారం పది శాతం మేర లాభపడిన క్రిప్టో నేడు మళ్లీ నష్టాల్లోకి వెళ్లింది. క్రితం సెషన్‌లో క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 33,000 డాలర్లను కూడా తాకింది. గత ఏడాది జూలై నుండి ఇదే కనిష్టం. నవంబర్ నెలలో ఇది 69,000 డాలర్లకు చేరువైంది. ఆ స్థాయితో పోలిస్తే సగానికి పైగా పడిపోయింది. అయితే ఆ తర్వాత కాస్త పుంజుకొని, 36,000 డాలర్లు దాటింది.
ఈ వార్త రాసే సమయానికి వివిధ క్రిప్టో వ్యాల్యూ ఇలా ఉంది.

బిట్ కాయిన్ 7.5 శాతం లాభపడి 36,798 డాలర్లు, ఎతేరియం 7.43 శాతం ఎగిసి 2,447 డాలర్లు, ఎక్స్‌పీఆర్ 4.32 శాతం లాభపడి సోలానా 7.60 శాతం ఎగిసి 94.29 డాలర్లు, కార్డానో 2.05 శాతం లాభపడి 1.04 శాతం, పోల్కాడాట్ 9.43 శాతం ఎగిసి 18.67 డాలర్లు, స్టెల్లార్ 7.56 శాతం ఎగిసి 0.196707 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 7.26 శాతం ఎగిసి .0140 డాలర్ల వద్ద, చైన్ లింక్ 6.10 శాతం లాభపడి 15.51 డాలర్ల వద్ద, షిబా ఇను 0.000021 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. టెర్రా మాత్రమే 2.19 శాతం క్షీణించి 64.57 డాలర్ల వద్ద ముగిసింది.

Bitcoin

బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్ల నుండి ప్రస్తుతం 36,000 డాలర్ల స్థాయికి క్షీణించింది. అయితే ఇదే మొదటిసారి కాదు. బిట్ కాయిన్ 2009లో లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటికి ఎనిమిదిసార్లు ఇలా భారీగా అంటే 50 శాతానికి పతనమైంది. 2018 నుండి ఇది మూడోసారి. అయినప్పటికీ కోలుకుంటోంది.

English summary

బిట్ కాయిన్ 8వసారి 50% వరకు పతనం, మళ్లీ ఎగిసిపడుతోంది | Bitcoin price has lost half its value again

The cryptocurrency has declined for six out of the last seven days, retreating nearly 10% on Monday, compared to its level at 5 p.m. on Friday. It traded for as little as $33,046, its lowest level since July, according to data from CoinDesk. Bitcoin’s record high was reached on Nov. 8 at $68,990.90.
Story first published: Tuesday, January 25, 2022, 22:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X