For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

20,000 డాలర్ల స్థాయిలోనే బిట్ కాయఇన్, షిబాఇను 13 శాతం జంప్

|

క్రిప్టో కరెన్సీ మార్కెట్ గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఇది ఆల్ టైమ్ గరిష్టంతో మూడొంతులకు పైగా తక్కువ. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ చాలా రోజులుగా 20,000 డాలర్లకు కాస్త అటు ఇటుగా, రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 1100 డాలర్ల స్థాయిలోకదలాడుతోంది. బుధవారం గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఇరవై నాలుగు గంటల్లో 3.69 శాతం క్షీణించింది.

బిట్ కాయిన్ గత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు మూడు శాతం తగ్గింది. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ 19,949 డాలర్ల వద్ద కనిష్టాన్ని, గత ఇరవై నాలుగు గంటల్లో 21,686 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 20,438 డాలర్ల వద్ద కదలాడింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 389 బిలియన్ డాలర్లు తగ్గింది.

 Bitcoin Holds $20,000 Level, Shiba Inu jumps 13 percent today

వివిధ క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే బిట్ కాయిన్ 2.37 శాతం, ఎథేరియం 4.31 శాతం, బియాన్స్ కాయిన్ 2.42 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 2 శాతం, సోలానా 5 శాతం, బియాన్స్ యూఎస్టీ 0.03 శాతం, కార్డానో 5 శాతం, స్టెల్లార్ 3.15 శాతం, డోజీకాయిన్ 1.5 శాతం నష్టపోయాయి. షిబా ఇను మాత్రం 13 శాతం వరకు లాభపడింది. యూనిస్వాప్ కూడా 11.3 శాతం ఎగిసిపడింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో వేవ్స్ 13.3 శాతం, షిబా ఇను దాదాపు 13 శాతం, టెర్రా యూఎస్టీ 12 శాతం, యూనీస్వాప్ 11.80 శాతం, వాజీర్ఎక్స్ 9.4 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో సెల్సియస్ 13.13 శాతం, స్టోర్జ్ 13 శాతం, ఎన్కేఎన్ 11 శాతం నష్టపోయాయి.

English summary

20,000 డాలర్ల స్థాయిలోనే బిట్ కాయఇన్, షిబాఇను 13 శాతం జంప్ | Bitcoin Holds $20,000 Level, Shiba Inu jumps 13 percent today

The global cryptocurrency market on Wednesday, June 22, remained volatile as investors did not see any fresh triggers to boost their confidence
Story first published: Wednesday, June 22, 2022, 18:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X