For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ కూడా నట్టేట ముంచుతోందిగా: 900 బిలియన్ డాలర్లు ఆవిరి

|

న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీ.. కొంతకాలంగా దేశీయ మార్కెట్‌లో రోజూ వార్తల్లో ఉంటూ వస్తోంది. తక్కువ సమయంలో లక్షాధికారులు కావడానికి ఇందులో భారీగా పెట్టుబడులను పెడుతుంటారు. అలాంటి మార్కెట్ ఇవ్వాళ భారీగా పతనాన్ని చవి చూసింది. కొన్నింటి రేట్లు ఫర్వాలేదనిపించుకుంటున్నాయి. అత్యధిక విలువ పలికే బిట్‌ కాయిన్, ఇథేరియం ధరలు మాత్రం దిగజారాయి.

వంటనూనెల ధరలను తగ్గించిన ఆ కంపెనీ: మరీ అంత నామమాత్రంగానా?వంటనూనెల ధరలను తగ్గించిన ఆ కంపెనీ: మరీ అంత నామమాత్రంగానా?

బిట్ కాయిన్ వాల్యూ 10 శాతానికి పైగా క్షీణించింది. రికార్డు స్థాయిలో తగ్గింది. మొన్నటివరకు 21,000 డాలర్లకు దిగువగా ట్రేడింగ్ అయిన బిట్ కాయిన్.. మరింత పడిపోయింది. 18,000 డాలర్లకు దిగువకు దిగజారింది. కనిష్ఠంగా 18,905 డాలర్ల వద్ల ట్రేడింగ్ రికార్డు చేసుకుంది. ఆ తరువాత స్వల్పంగా పెరిగింది. 19,040 డాలర్ల వద్ద ట్రేడింగ్ అయింది.

Bitcoin has broken the $19,000 levels, the first time since December 2020, follows Ethereum

2020 డిసెంబర్ తరువాత బిట్ కాయిన్ ధర ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ఇథేరియం సైతం పతనమైంది. 1,000 డాలర్లకు దిగువగా ట్రేడింగ్ అయింది. కనిష్ఠంగా 986 డాలర్ల వద్ద ట్రేడింగ్ అయింది. స్వల్పంగా పెరిగి 992 డాలర్లకు చేరింది. 24 గంటల వ్యవధిలో బిట్ కాయిన్-861, ఇథేరియం-9.65, టెదర్-0.08, యూఎస్డీ కాయిన్-0.04 బీఎన్‌బీ-8.97, బినాన్స్-0.02, కార్డానో-7.72, ఎక్స్‌ఆర్ప-7.62, సొలానా-7.62, డోజ్ కాయిన్-5.14 శాతం మేర విలువ తగ్గింది.

దేశీయ స్టాక్ మార్కెట్స్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా క్రిప్టోకరెన్సీ వేల్యూ పడిపోతూ వస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికాలో ఏర్పడిన ఆర్థిక స్థితిగతులు దీనికి కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. వారం రోజుల వ్యవధిలో 900 బిలియన్ డాలర్ల క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరి అయింది.

ఇది మరింత పెరిగే అవకాశం లేకపోలేదని మార్కెట్ రీసెర్చ్ కంపెనీ యూనిఫార్మ్ సీఓఓ తరుషా మిట్టల్ చెప్పారు. కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కెట్ డేటా సైతం దీన్నే స్పష్టం చేస్తోంది. 24 గంటల్లో క్రిప్టో మార్కెట్ వాల్యూమ్ 59.01 బిలియన్ డాలర్లు తగ్గినట్టు కాయిన్ మార్కెట్ తెలిపింది.

English summary

బిట్ కాయిన్ కూడా నట్టేట ముంచుతోందిగా: 900 బిలియన్ డాలర్లు ఆవిరి | Bitcoin has broken the $19,000 levels, the first time since December 2020, follows Ethereum

Bitcoin has broken the $19,000 levels, the first time since December 2020, follows Ethereum.
Story first published: Saturday, June 18, 2022, 18:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X