క్రిప్టోకరెన్సీ మార్కెట్ అంతకంతకూ క్షీణిస్తోంది. ఓ సమయంలో 65వేల స్థాయికి వెళ్లిన క్రిప్టో కింగ్ బిట్ కాయిన్, 3వేలు క్రాస్ చేసిన సెకండ్ బిగ్గెస్ట్ క్రిప్టో ఎథేరియం ఇప్పుడు కిందకు జారుతున్నాయి. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు, చైనా, టర్కీ వంటి దేశాల నిర్ణయాలు క్రిప్టోను దెబ్బతీస్తున్నాయి. తాజాగా చైనా సోషల్ మీడియా వేదిక వైబో కొన్ని క్రిప్టో అకౌంట్ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై వైబో అధికార ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు. క్రిప్టో కరెన్సీని సంస్థాగతంగా స్వీకరించేందుకు చాలా పెద్ద ప్రక్రియ అని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది.
బిట్ కాయిన్ సహా పలు క్రిప్టోకరెన్సీలు ఆదివారం నుండి ఇరవై నాలుగు గంటల్లో దారుణంగా పతనమయ్యాయి. కాయిన్ జెకో అంచనా ప్రకారం ఎథేరియం మాత్రం స్వల్పంగా లాభపడింది. గతంలో క్రిప్టో ట్రేడింగ్, బిట్ కాయిన్ మైనింగ్ పైన చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.

దీంతో క్రిప్టో కరెన్సీ ధరలపై ఒత్తిడి పెరిగింది. వైబో నిషేధం, గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక నేపథ్యంలో బిట్ కాయిన్ ఇరవై రోజుల దిగువకు పడిపోయింది. అంతేకాదు, బిట్ కాయిన్ రియల్ మనీ కాదని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. 200 రోజుల కనిష్టస్థాయికి పడిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications