For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలాన్ మస్క్ ఎఫెక్ట్: 4 శాతానికి పైగా ఎగిసిన బిట్ కాయిన్, ఎథేరియం

|

ఎలక్ట్రిక్ కార్‌మేకర్ టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ అనంతరం బిట్ కాయిన్, పోల్కాడాట్, ఎథేరియం వంటి క్రిప్టోకరెన్సీలు ఎగిసిపడుతున్నాయి. వరల్డ్ టాప్ 10 డిజిటల్ టోకెన్స్ నేడు పదహారు శాతం వరకు లాభపడ్డాయి. బిట్ కాయిన్ కొనుగోలుపై సానుకూలంగా ట్వీట్ చేయడం క్రిప్టోపై సానుకూల ప్రభావం పడింది. ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా బిట్ కాయిన్ కొనుగోలు చేయడం, ఇతర కంపెనీలు కూడా క్రిప్టో కరెన్సీకి ప్రాధాన్యత ఇవ్వడంతో వీటి వ్యాల్యూ అంతకంతకూ పెరిగింది.

బిట్ కాయిన్ ఓ సమయంలో 65వేల డాలర్లను సమీపించింది. ఎథేరియం 3వేల డాలర్లు దాటింది. అయితే మస్క్ క్లీన్ ఎనర్జీ నిర్ణయం, చైనా ఆంక్షలు, టర్కీ షాకివ్వడంతో బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టంతో దాదాపు సగం పతనమైంది. ఆ తర్వాత 40వేల డాలర్ల దిగువనే కొట్టుమిట్టాడుతోంది. నేడు ఓ సమయంలో 40వేల డాలర్లు దాటినప్పటికీ, ఆ దగ్గరలో ట్రేడ్ అవుతోంది.

Bitcoin, Ethereum surge up to 4 percent today

వివిధ క్రిప్టోకరెన్సీల వ్యాల్యూ...

Bitcoin: $40,518.56, 4.32 శాతం వరకు ఎగిసింది.
Ethereum: $2,595.23, 4.82 శాతం వరకు ఎగిసింది.
Tether: $1.00, 0.07 శాతం వరకు ఎగిసింది.
Binance Coin: $373.65, 4.22 శాతం వరకు ఎగిసింది.
Cardano: $1.58, 2.54 శాతం వరకు ఎగిసింది.
Dogecoin: $0.33, 1.74 శాతం వరకు ఎగిసింది.
XRP: $0.89, 2.16 శాతం వరకు ఎగిసింది.
Polkadot: $25.26, 16.785 శాతం వరకు ఎగిసింది.
USD Coin: $1, 0.04 శాతం వరకు ఎగిసింది.
HEX: $0.092, 6.09 శాతం వరకు ఎగిసింది.

English summary

ఎలాన్ మస్క్ ఎఫెక్ట్: 4 శాతానికి పైగా ఎగిసిన బిట్ కాయిన్, ఎథేరియం | Bitcoin, Ethereum surge up to 4 percent today

Major Crytpocurrencies, Bitcoin, Polkadot, were trading higher after investor's confidence was boosted by Tesla chief Elon Musk's tweet on weekend.
Story first published: Tuesday, June 15, 2021, 21:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X