మళ్లీ నష్టాల్లో బిట్ కాయిన్, డోజీకాయిన్, షిబా ఇను 23 శాతం డౌన్
క్రిప్టో కరెన్సీ కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ నేడు 62,000 మార్కు దిగువకు పడిపోయింది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో మార్కెట్ అయిన బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక శాతం తగ్గి 61,946 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ మోస్ట్ పాపులర్ డిజిటల్ టోకెన్ 2021 క్యాలెండర్ ఏడాదిలో 114 శాతం వృద్ధి సాధించింది. అక్టోబర్ నెలలో ఇది ఆల్ టైమ్ గరిష్టం రూ.67,000 డాలర్ల సమీపానికి చేరుకుంది. సెకండ్ బిగ్గెస్ట్ క్రిప్టో ఎథేరియం ఒక శాతం పడిపోయి 4,531 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 3 శాతం క్షీణించి 0.26 డాలర్ల వద్ద, XRP, కార్డానో, యూనిస్వాప్, లైట్ కాయిన్, పోల్కాడాట్ కూడా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక షిబా ఇను 23 శాతానికి పైగా నష్టపోయి 0.000046 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సోలానా, బియాన్స్ కాయిన్, టెథెర్ మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. షార్ట్ వీడియో యాప్ చింగారీ తన తొలి క్రిప్టో టోకెన్ 'గారీ' కోసం 24 గంటల్లో 40 మిలియన్ డాలర్లను సమీకరించింది.
బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పుడు లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఆ తర్వాత కొద్ది నెలలపాటు ఊగిసలాటలో ఉంది. ఆ తర్వాత జూలై నెలలో 30,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అక్కడి నుండి స్వల్పంగా లాభపడుతూ కొద్ది నెలల పాటు 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడింది. ఈ నెల కాలంలో 50వేల డాలర్లను దాటి, అక్కడి నుండి పరుగులు పెడుతోంది. 55వేల డాలర్లు దాటిన తర్వాత గతవారం సెషన్‌లలోనే 60 వేల మార్కును దాటింది. ఈ వారం 62వేలను దాటి, ఇటీవల 66వేల డాలర్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత 60వేల స్థాయికి పడిపోయింది. ఇప్పుడు మళ్లీ 62,000 వద్ద ఉంది.

వివిధ కరెన్సీల వ్యాల్యూ
- Bitcoin : $61,162, -2.95%
- Ether : $4,486, -3.17%
- Dogecoin : 0.262293
- Litecoin : 201.48
- XRP - 1.20
- Cardano - 2.02
- S&P 500: $4,675, +0.32%
- Gold: $1,793, +0.95%
- 10-year Treasury yield closed at 1.52%